Moviesప్ర‌భాస్‌కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మ‌లు... రొమాన్స్ కుమ్ముకోవ‌చ్చుగా...!

ప్ర‌భాస్‌కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మ‌లు… రొమాన్స్ కుమ్ముకోవ‌చ్చుగా…!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్ప‌డు వ‌రుస పెట్టి క్రేజీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఈ యేడాది రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప్ర‌భాస్ చేతిలో ఇప్పుడు ఆదిపురుష్ – ప్రాజెక్ట్ కే – స‌లార్ – స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలోనూ ప్ర‌భాస్ ఓ సినిమాకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం మారుతి యేడాది కాలంగా వ‌ర్క్ చేస్తోన్నాడు.

ఈ సినిమాలో న‌టించేందుకు ప్ర‌భాస్ కేవ‌లం 45 రోజుల కాల్షీట్లు మాత్ర‌మే ఇవ్వ‌గా.. అందుకోసం నిర్మాత‌లు ఏకంగా రు. 70 కోట్ల రెమ్యున‌రేష‌న్ సింగిల్ పేమెంట్‌లో చెక్ రూపంలో ఇచ్చార‌ని టాక్ ? రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందే ఈ డీల్ జ‌రిగిన‌ట్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది. రీసెంట్‌గా పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉండ‌డంతో మారుతి ఈ సినిమా కోసం హీరోయిన్ల వేట‌లో ప‌డ్డాడు.

ఇప్ప‌టికే రెండు పాత్ర‌ల కోసం నిధి అగర్వాల్‌, మాళ‌విక పేర్లు ఫైన‌లైజ్ చేశారు. ఇక ఇప్పుడు మూడో హీరోయిన్‌ను కూడా ఫిక్స్ చేసేశార‌ట‌. వ‌ర్థ‌మాన హీరో శ్రీలీల‌ను ప్ర‌భాస్ ప‌క్క‌న మూడో ముద్దుగుమ్మ‌గా ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. నిజంగా ఈ ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌తో రొమాన్స్ అంటే ప్ర‌భాస్ కుమ్ముకోవ‌డ‌మే..! ఇక వ‌చ్చే వారంలో ఓ చిన్న షెడ్యూల్‌తో ఈ సినిమా ప్రారంభిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news