Moviesనందమూరి బిడ్డ మజాకా..ఒక్క దెబ్బతో అందరి నోర్లు..ఖతక్..!!

నందమూరి బిడ్డ మజాకా..ఒక్క దెబ్బతో అందరి నోర్లు..ఖతక్..!!

నందమూరి నటవారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతడి అందం.. అతని నటన ..అతడి బిహేవియర్ అతని హుందాతత్వం ముందు ఎవరు సాటిరారు. అంతలా తన పేరుని జనాలో మదిలో చెరగనీకుండా ముద్రించుకునేశాడు.. ఈ జూనియర్ నందమూరి తారక రామారావు.

కాగా రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో.. ప్రస్తుతం కొరటాల సినిమా షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు . జపాన్ లో RRR రిలీజ్ కారణంగా అక్కడికి చెక్కేసిన తారక్ ..ప్రమోషన్స్ పనుల్లో బిజీగా గడుపు తూనే.. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ.. అక్కడ అభిమానులను దగ్గరుండి పలకరిస్తూ ..వారి ఇంటికి వెళ్తూ సరదాగా గడుపుతున్నారు . కాగా దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

ఆర్ఆర్ఆర్ సినిమాతో పోలిస్తే తారక్ బాగా బరువు తగ్గిపోయాడు . సన్నగా ..స్లిమ్ గా చూడడానికి స్టైలిష్ గా భలే ముద్దుగా ఉన్నాడు .అంతేకాదు కొరటాల సినిమాకు సంబంధించిన లుక్ ఇదే అయితే మాత్రం కొరటాల సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్టే . ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ జపాన్ స్టైలిష్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ .

RRR సినిమా రిలీజ్ టైంలో తారక్ లుక్స్ పై ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన లుక్స్ ఇలా ట్రెండింగ్ లోకి రావడంతో అలాంటి వాళ్ల నోర్లు మూయించిన్నట్లైంది తారక్. ఈ క్రమంలోనే #YOUNGTIGER,#NTR,#JRNTR ట్రెండింగ్లోకి వచ్చాయి. అంతేకాదు తారక్ చూడడానికి చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నారు అంటూ అమ్మాయిలు కూడా కామెంట్స్ పెడుతున్నారు. చూడాలి మరి ఎన్టీఆర్ కొరటాల సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అభిమానుల ఆకలి ఎప్పుడు తీరుస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news