Moviesహా..అవును..అన్నాడు..అయితే తప్పేంటి..? యమ రంజుగా మారిన చిరు-బాలయ్య వార్..!!

హా..అవును..అన్నాడు..అయితే తప్పేంటి..? యమ రంజుగా మారిన చిరు-బాలయ్య వార్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా బాలకృష్ణ-చిరంజీవి సినిమా వార్ అనే చెప్పాలి .తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ,, ఇద్దరు సినిమాలో దాదాపు ఓకే మూమెంట్లో రిలీజ్ అయినవే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ సిచువేషన్ కనిపిస్తుంది. మనకు తెలిసిందే రీసెంట్ గా గాడ్ ఫాదర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి..త్వరలోనే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా మన ముందుకు రాబోతున్నాడు .

ఈ సినిమా అనుకున్నప్పుడే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ బాబీ ఫిక్స్ అయ్యాడట . ఇదే టైంకి నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా కూడా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి – బాలయ్య మధ్య టాఫ్ ఫైట్ నడుస్తున్నత్లు తెలుస్తుంది. అయితే రెండు సినిమాలు నిర్మించేది మైత్రి మూవీ మేకర్స్.

ఈ క్రమంలోని ఇక్కడ పెద్ద చిక్కే వచ్చి పడింది . కాగా ఇద్దరు స్టార్ హీరోస్ ఆ సినిమాలను రిలీజ్ చేసే విషయంలో వెనకడుగు వేయట్లేదు. ఈ విషయంలో బాలకృష్ణ – చిరంజీవి కూడా మొండిగా భీష్మించుకుని కూర్చున్నారట. ఈ క్రమంలోనే బాలయ్యను వెనక్కి తగ్గమని అడిగిన మైత్రి మేకర్స్ తో..బాలయ్య మాత్లాడుతూ..” మొన్ననేగా గాడ్ ఫాదర్ రిలీజ్ అయ్యింది.. ఇంత ఫాస్ట్ గా సంక్రాంతికి రావడం అవసరమా” అంటూ చిరంజీవి సినిమా గురించి కామెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వాల్తేరు వీరయ్య వ్శ్ నరసింహారెడ్డి సినిమా పేర్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. అంతేకాదు ఇదే డేట్ కి ఆది పురుష్, వారసుడు, అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . అయితే బాలయ్య ఫాయ్న మాత్రం..”బాలయ్య మాటలో నిజం ఉందిగా” అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ జరగబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . మరి చూడాలి సంక్రాంతి అసలైన హీరో ఎవరో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news