Moviesవెరీ వెరీ ఇంట్రెస్టింగ్ : కోట్లాది మంది నందమూరి అభిమానుల కల...

వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ : కోట్లాది మంది నందమూరి అభిమానుల కల నెరవేరబోతుందోచ్..!!

వావ్ ..నిజంగా ఇది నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి . కోట్లాదిమంది నందమూరి అభిమానులు కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడా ఎప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న క్షణం త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది . నిజమైన నందమూరి అభిమానులు ఎవరైనా సరే ఈ వార్త విన్న తరువాత ఆనందపడాల్సిందే. అలాంటి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట లీక్ అయి నందమూరి అభిమానులను సంతోష పెడుతుంది.

రీసెంట్గా కళ్యాణ్ రామ్ నటించిన సినిమా బింబిసారా. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ లా వచ్చిన బింబిసారా సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డ్ నమోదు చేసింది. ఎప్పుడూ లేనని కలెక్షన్లు సాధించి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది .కాగా ఈ సినిమా ఇప్పుడు జీ ఫైవ్ లో విడుదలై అక్కడ కూడా సత్తా చాటుతుంది కొత్త డైరెక్టర్ కొత్త దర్శకుడు నందమూరి బాడి లాంగ్వేజ్ నందమూరి కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ ని పసికట్టి ఆ రేంజ్ లో తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ట.

ఈ క్రమంలోనే సినిమా సీక్వెల్ ఎప్పుడు అంటూ నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కాగా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫాన్స్ కు డైరెక్టర్ వశిష్ట అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే బింబిసారా 2 వస్తుందని అఫీషియల్ గా ప్రకటించాడు . అంతేకాదు అందరూ షాక్ అయ్యేలా ఈ సినిమాలో మరో బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుంది అంటూ క్రేజీ హింట్ వదిలాడు . ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ..”బింబిసారా సినిమా 2 లో నందమూరి అభిమానులు కోరుకున్న అంశాలన్నీ పుష్కలంగా ఉంటాయని ..ఎవరు ఊహించని ఓ స్టార్ సెలబ్రిటీ ఈ సినిమాలో నటించబోతున్నారని “చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా నెట్టింట బింబిస్దారా 2 హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది .

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ క్రేజీ వ్యక్తి ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఓ మ్యాటర్ లీక్ అయింది . ఒకవేళ అదే నిజమైతే నందమూరి హీరోలను ఒకే తెరపై చూడాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్న అభిమానుల కోరిక తీరిపోయినట్లే ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news