Moviesఆయన అన్న మాటలకు కన్నీరు పెట్టుకున్న సుధ.. ఆ ఉసురు ఊరికే...

ఆయన అన్న మాటలకు కన్నీరు పెట్టుకున్న సుధ.. ఆ ఉసురు ఊరికే పోదు..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో సుధా అనే పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 500 కి పైగా తెలుగు సినిమాల్లో నటించి అలరించి మెప్పించిన నటి సుధ. ప్రజెంట్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు గ్రీన్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అందరికంటే ముందు వరుసలో ఉంటారు సుధా అని చెప్పడంలో సందేహం లేదు . 30 ఏళ్ల కింద కెరియర్ మొదలుపెట్టిన సుధా సుమారు అన్ని భాషల్లో కలిపి 850 సినిమాలకు పైగా నటించారు. కేవలం తెలుగులోనే కాదు సౌత్ భాషలన్నిటిలోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సుధ.

అయితే ఈమె హీరోలకి అమ్మగా.. హీరోయిన్స్ కి తల్లిగా.. వాళ్ళ సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే . కాగా ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ టైంలో సుధా ఆ సీన్ కి తగ్గట్టు స్టేజిపై పెర్ఫార్మన్స్ ఇవ్వాల్సి ఉంటుంది . నిజానికి సుధా కి డాన్స్ అసలుకి రాదు. అయినా కానీ డైరెక్టర్ చెప్పడంతో సుధా డాన్స్ చేస్తానని సిద్ధపడింది . అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్న సుందరం మాస్టర్ సుధా డాన్స్ మెప్పించలేకపోయింది.

ఈ క్రమంలోనే అక్కడే అందరూ ఉండగా..” నీ ముఖానికి ఈ డ్యాన్స్ కూడా మాత్రం రాదా.. నువ్వు దేనికి పనికిరావు “అంటూ కోపడ్డారట. అందరి ముందు అలా అరిచే సరికి సుధా అక్కడే కన్నీరు పెట్టుకున్నారట. కొంతసేపు ఏడ్చేసారట. ఇక తర్వాత సెట్ అయ్యి మళ్లీ ప్రాక్టీస్ చేయగా.. ఆ సాంగ్ స్టెప్స్ వేశారట .

దీంతో ఆయన మాటలు బాగా బాధపెట్టాయట. అయితే కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే సుందరం మాస్టర్ వేరే సినిమాలో తల్లి రోల్ చేయడానికి సుధా నటన అయితే బాగుంటుంది అని ఇంటికి వచ్చి మరి రిక్వెస్ట్ చేశారట . దీంతో ఆనాడు బాధపడిన సుధా ఆయన ఇంటికి వచ్చిన నాడు ఆ కోపాన్ని చూపించకుండా మర్యాదలు చేసి మరి సినిమాకి ఒప్పుకున్నిందట, అంత మంచి మనసున్న సుధా కెరియర్లో ఎన్నో చెప్పుకోలేని విషయాలతో బాధపడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news