Moviesఅప్పట్లో పూజా హెగ్డేలా బికినీలో రెచ్చగొట్టిన స్టార్ హీరోయిన్.. దెబ్బకే ఫ్యామిలీ...

అప్పట్లో పూజా హెగ్డేలా బికినీలో రెచ్చగొట్టిన స్టార్ హీరోయిన్.. దెబ్బకే ఫ్యామిలీ ఆడియన్స్‌కి దూరం..!

అగ్ర దర్శకుడు కె బాల చందర్ రూపొందించిన ఇండస్ట్రీ హిట్ మరో చరిత్ర సినిమా ద్వారా సౌత్ సినిమా పరిశ్రమకి పరిచయం అయింది మాధవి. అప్పటికి ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలే. చాలా చిన్న వయసులోనే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం అలాగే హిందీ భాషలలో హీరోయిన్‌గా కీలక పాత్రల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. మరో చరిత్ర సినిమాలో ఏ ఆత్రనైతే పోషించారో అదే పాత్రకు హిందీలో రీమేక్ చేస్తే కూడా మాధవినే తీసుకున్నారు.

మాధవిది హైదరాబాద్. ఇక్కడ భరత నాట్యం, కూచిపూడి నేర్చుకొని వేల ప్రదర్శనలిచ్చారు. మాధవి అసలు పేరి కనక మహాలక్ష్మి. కానీ, అప్పటికే లక్ష్మీ అనే పేర్లతో నటీమణులుండటం వల్ల దర్శకరత్న దాసరి నారాయణరావు మొదటి సినిమాకే తన పేరును మాధవిగా మార్చేశారు. మాధవి అచ్చతెలుగమాయి కావడం బాగా కలిసివచ్చింది. డైలాగ్ చెప్పే మాడ్యులేషన్ కూడా కాస్త భిన్నంగా ఉండటం అలాగే తన కళ్ళు బాగా ప్లస్ అవడం మాధవిని మంచి స్థాయికి తీసుకువచ్చాయి.

ముఖ్యంగా చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసింది మాధవి. అంతేకాదు వీరిద్దరిది హిట్ కాంబినేషన్. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి, మాధవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి కంప్లీట్ ఫ్యామిలీ సినిమా చేసి ఆకట్టుకున్న మాధవి ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలిపొద అంటూ సెగలు పుట్టించారు. అంతేకాదు, ఇప్పుడు పూజా హెగ్డే ని బికినీలో చూసి నోరెళ్ళబెట్టినవారెందరో ఉన్నారు.

కానీ, అప్పట్లో మాధవి ఇదే బికినీ ధరించి సంచలనం సృష్ఠించించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేస్తూ విజయశాంతి, రాధ, రాధిక, సుహాసిని లాంటి వారికి గట్టి పోటీ ఇచ్చిన మాధవి కమల్ హాసన్ నటించిన టిక్ టిక్ టిక్ సినిమాలో బికినీ వేసి అదరగొట్టింది. అప్పట్లో మాధవి నుంచి ఇలాంటి సన్నివేశాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. మరో ఇద్దరు హీరోయిన్స్ రాధ, స్వప్నలతో కలిసి మాధవి బికినీ ధరించి కమల్ అక్కన నటించింది. అప్పట్లో ఇదో పెద్ద హాట్ టాపిక్ అయింది కూడా. ఇదే మాధవి కెరీర్ చివరిలో మాతృ దేవోభవ సినిమా చేసి గుండెల్ని పిండేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news