Moviesమ‌హాల‌క్ష్మిలా మెరిసిపోతోన్న తార‌క్ భార్య ' ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ' ......

మ‌హాల‌క్ష్మిలా మెరిసిపోతోన్న తార‌క్ భార్య ‘ ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ‘ … ఇంత స్పెష‌ల్ ఏంటంటే…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కుటుంబానికి ఎంత ప్రాధాన్య‌త ఇస్తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ – ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి వివాహం 2011లో జ‌రిగింది. అప్ప‌టి నుంచి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపించ‌రు. ఆమె ఓ స్టార్ హీరోకు భార్య‌గా ఉండి కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటుంది. తార‌క్ సినిమా ఈ వెంట్ల‌కే కాదు… బ‌య‌ట ఇండ‌స్ట్రీ ఈవెంట్ల‌కు కూడా ఆమె ఎప్పుడూ దూరంగా ఉంటుంది.

ఈ దంప‌తుల‌కు అభ‌య్‌రామ్‌, భార్గ‌వ్ రామ్ అనే ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. అయితే ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి తాజాగా మ‌హాల‌క్ష్మిలా మెర‌సిపోతోన్న ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ఫొటోలు చూసిన నెటిజ‌న్లు మ‌హాల‌క్ష్మిలా మెరిసిపోతోందంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సాధార‌ణంగా సింపుల్‌గా ఉండేందుకే ఇష్ట‌ప‌డే ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ఈ సారి మాత్రం త‌న స్టైల్‌కు భిన్న‌మైన లుక్‌లో క‌నిపించారు.

ప‌ట్టు చీర‌లో న‌గ‌లు పెట్టుకుని కుంద‌న‌పు బొమ్మ‌లా క‌నిపిస్తోంది. నంద‌మూరి అభిమానుల‌తో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఆమె అచ్చ తెలుగు ఆడ‌ప‌డుచులా ఉంద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇక ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి త‌న ఇద్ద‌రు కుమారుల ఆల‌పా పాల‌నా చూసుకుంటూ త‌న అత్త షాలినితో క‌లిసి కుటుంబాన్ని చూసుకునేందుకు ప్రాధాన్య‌త ఇస్తూ ఉంటుంది.

ఇక ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి సోద‌రుడు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. శ‌త‌మానం భ‌వ‌తి డైరెక్ట‌ర్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమాతో హీరోగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news