Moviesఫ‌స్ట్ టైం అలియాను అంద‌రి ముందు అంత మాట అనేసిన ఎన్టీఆర్‌...!

ఫ‌స్ట్ టైం అలియాను అంద‌రి ముందు అంత మాట అనేసిన ఎన్టీఆర్‌…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో సౌత్ ఇండియా అంత‌టా బ్ర‌హ్మాస్త సినిమా రిలీజ్ అవుతోంది. బాలీవుడ్‌లో క‌ర‌ణ్‌జోహార్‌తో పాటు మ‌రి కొంద‌రు నిర్మాత‌లు క‌లిసి నిర్మించిన ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో నేష‌న‌ల్ వైడ్‌గా మోస్ట్ రొమాంటిక్ క‌ఫుల్స్‌గా ఉన్న ర‌ణ‌బీర్‌క‌పూర్ , ఆలియా భ‌ట్ హీరో, హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ అంచ‌నాలు ఉన్న నేప‌థ్యంలో నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున తెలుగు వెర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు.

అయితే చివ‌ర్లో పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. చివ‌ర్లో ఓ హోట‌ల్లో ప్రెస్‌మీట్‌లా పెట్టారు. ఈ ప్రెస్‌మీట్లో అంద‌రి ముందు ఎన్టీఆర్ ఆలియాభ‌ట్‌ను డార్లింగ్ అని పిలిచి కాస్త ఆశ్చ‌ర్య ప‌రిచాడు. ఎన్టీఆర్ హీరోయిన్ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాడు. అయితే ఆలియాతో తార‌క్‌కు త్రిబుల్ ఆర్ సినిమా నుంచే మంచి ప‌రిచ‌యం ఉంది.

Jr NTR Apologises To His Fans, Compares Ranbir Kapoor To Amitabh Bachchan  And Calls Alia Bhatt 'Darling' At The Press Conference Of Brahmastra –  SimplyAmina

ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా ఆలియా న‌టించింది. అయితే సినిమాలో తార‌క్ – ఆలియా మ‌ధ్య వ‌చ్చే సీన్లు కూడా హైలెట్ అయ్యాయి. సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కూడా ఆలియా – తార‌క్ చాలా రోజులు క‌లిసే ట్రావెల్ చేశారు. దీంతో అక్క‌డ ఇద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ త‌ర్వాత కొర‌టాల శివ – ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు కూడా ముందుగా ఆలియాను హీరోయిన్‌గా అనుకున్నారు.

The Kapil Sharma Show: Jr NTR Teases Alia Bhatt About Her 'Size Zero' In  Uncensored Clip, Latter Smacks Him - Filmibeat

అయితే ఆమె ముందు ఓకే చెప్పింది. త‌ర్వాత ప్రెగ్నెంట్ కావ‌డంతోనే తార‌క్‌తో న‌టించే ఛాన్స్‌ను అయిష్టంగానే వ‌దులుకుంద‌ని అంటారు. ఇక మ‌రి బ్ర‌హ్మాస్త్ర సినిమాకు తెలుగులో ఎన్టీఆర్ ప్ర‌మోష‌న్లు ఎంత వ‌ర‌కు హెల్ఫ్ అవుతాయో ? చూడాలి. ఈ నెల 9న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news