Moviesఓ మై గాడ్: బిగ్ బాస్ లోకి ఉదయభానుని రానివ్వకుండా ఆపింది...

ఓ మై గాడ్: బిగ్ బాస్ లోకి ఉదయభానుని రానివ్వకుండా ఆపింది ఆయనేనా..!?

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రారంభమైంది. బిగ్ బాస్ అంటేనే అరుపులు కేకలు హంగామాలు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు .దానికి ఏమాత్రం తీసుపోకుండా ముందుగానే ప్రిపేర్ గా వచ్చారు మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ . షో చూస్తున్న ఎవరికైనా ఈ విషయం బాగా అర్థమవుతుంది . అవసరం ఉన్నా లేకున్నా గొడవలు అడిగిమరీ తిట్టించుకునే కంటెస్టెంట్..ఆ సాకుతో ఓదార్చే అబ్బాయిలు.. ఇవన్నీ ఎడిటర్ బాగా గమనిస్తాడు. అందుకే జనాలకి ఏ విధంగా అర్థం కావాలో అలాగే కట్ చేసి ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తాడు. దీంతో బిగ్ బాస్ షో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది


కాగా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు యాంకర్ ఉదయభాను. అమ్మో హౌస్ లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా అమ్ముడు పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. హౌస్ లో అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ కూడా ఉదయభానునే.. అని దీనికోసం ఆమె క్రేజీ కండిషన్స్ పెట్టిందని కూడా వార్తలు వినిపించాయి. సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ లోకి ఉదయభాను వెళ్లలేదు . అదేంటి అంత పాపులారిటీ ఉన్న అంత బాగా వినిపించిన ఈ పేరు ఎందుకబ్బా హౌస్ లోకి వెళ్లలేకపోయింది అనుకుంటున్నారు జనాలు.

అయితే దానికి కారణం నాగార్జున అని తెలుస్తుంది. ఎస్ ఉదయభానుని బిగ్ బాస్ లోకి పంపకుండా ఆపింది నాగార్జున నేనట. దానికి కారణం ఆమెకు ఆయనకు గతంలో ఉన్న విభేదాలే అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది . నిజానికి బిగ్ బాస్ ఈ సీజన్ కి హోస్టుగా నాగార్జున చేయాల్సింది కాదట. మరో హీరో చేయాల్సింది కానీ లాస్ట్ మినిట్లో ఆ హీరో హ్యాండ్ ఇవ్వటంతో అనూహ్యంగా నాగార్జున తెరపైకి రావడం.. కరెక్ట్ గా అదే టైం లోనే ఉదయభానుని బిగ్ బాస్ రిజెక్ట్ చేయడం ..అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకోకుండా ఉదయభానుని హోల్డ్ లో పెట్టినప్పుడే ఈ విషయం ఉదయభానుకు అర్థమైందట.దీంతో ఉదయభాను బిగ్ బాస్ లోకి రానివ్వకుండా ఆపింది నాగార్జున అని అంటూ ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news