Moviesకాఫీ షాప్ లో ఇన్ని జరుగుతాయా..? అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

కాఫీ షాప్ లో ఇన్ని జరుగుతాయా..? అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కవాడు బాగుపడకూడదు. ఇలాంటి మైండ్ సెట్ తోనే జనాలు ముందుకెళ్తున్నారు. అది ఎలాంటి ఫీల్డ్ అయినా సరే మన పక్కింటి ఆంటీలు కావచ్చు ..ఎదురింటి అంకుల్స్ కావచ్చు . ఫ్రెండ్స్ కావచ్చు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కావచ్చు. ఒక హీరోహిట్ కొడితే క్లాప్స్ కొడుతూ అప్రిషియేట్ చేసే హీరోస్ మనసులో ఎలా ఊహించుకుంటారో అందరికీ తెలిసిందే. పైన పటారం లోన లొటారం పైకి ఏమో కంగ్రాట్యులేషన్స్.. లోన ఏమో కుళ్ళుకునే మనస్తత్వం. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు.

అయితే వాళ్లందరిలోకి డిఫరెంట్ అనిల్ రావిపూడి. సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలను డైరెక్ట్ చేస్తూ జనాలు చేత శభాష్ అనిపించుకుంటూ టాప్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ ఫైవ్ డైరెక్టర్ లిస్టులో ఒకరుగా ఉన్నారు. అంతేకాదు అనిల్ రావిపూడి మైండ్ సెట్ కూడా వేరే.. కుళ్ళు కుతంత్రాలు.. ఈగోలు ఇలాంటివన్నీ ఆయనకు నచ్చవు .హెల్దిగా ఉన్నామా హ్యాపీగా నవ్వించుకున్నామా.. అందరితో కలిసి ఉన్నామా ..ఇదే మైండ్ సెట్ అనిల్ రావిపూడి సినిమా లో మనం గమనించవచ్చు. ఆయన సినిమాలో కూడా ఇదే పాజిటివ్ నెస్ మనం క్లియర్ గా చూడొచ్చు.

కాగా రీసెంట్గా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా “కాఫీ విత్ ఏ కిల్లర్” ది బెస్ట్ క్రియేషన్స్ సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ పై సెవెన్ హిల్స్ సతీష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రీసెంట్గా ట్రైలర్ ని హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైలర్ ని రిలీజ్ చేసి సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇండస్ట్రీలో తాను ఎదగడం కాదు పక్కవారిని కూడా ఎదిగేలా చేసే ఏకైక డైరెక్టర్ అనిల్ రావిపూడి అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో అనిల్ రావిపూడి తర్వాతే ఎవరైనా. కాగా “కాఫీ విత్ ఏ కిల్లర్” ట్రైలర్ ఈవెంట్లు అనిల్ రావిపూడి మాట్లాడుతూ..” కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రి రిలీజ్ ఈవెంట్స్ తో అదరగొట్టేస్తున్నాయి, మరీ ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలను జనాలు ఎక్కువ ఆదరిస్తున్నారు . కచ్చితంగా అలాంటి స్కోప్ ఉన్న కంటెంట్ కాఫీ విత్ కిల్లర్ ట్రైలర్ లో కనిపిస్తుంది.

ఇప్పటివరకు నాకు తెలియదు ఓ కాఫీ షాప్ లో ఇన్ని జరుగుతాయా అని.. చాలా ఎంటర్టైనింగ్ గా కనిపిస్తుంది టైలర్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను . ఈ ట్రైలర్ చూశాక నాకు ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది ఆర్పి గారే హీరో అనిపించింది . నాకు మొదటి నుంచి ఆర్పి గారు అంటే చాలా ఇష్టం ప్రత్యేకమైన అభిమానం కచ్చితంగా ఈ సినిమాతో ఆయన మంచి హిట్ కొడతారని అనుకుంటున్నాను, నా బెస్ట్ విషెస్ చిత్ర బృందానికి తెలియజేస్తున్నాను “అంటూ చెప్పుకొచ్చారు దీంతో అనిల్ రావిపూడి పాజిటివ్ కామెంట్స్ సినిమాకు మంచి బూస్టప్ ఇచ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news