Movies"ఏం పీకుతావ్ రా అబ్బాయి"..అఖిల్ తాజా నిర్ణయం కొంప ముంచేలా ఉందే..!?

“ఏం పీకుతావ్ రా అబ్బాయి”..అఖిల్ తాజా నిర్ణయం కొంప ముంచేలా ఉందే..!?

సినీ ఇండస్ట్రీలో హీరోకి హీరోయిన్ లకి కొదవ ఏం లేదు.. అయినా కానీ ఫిలం ఇండస్ట్రీ పెద్ద విశాలమైన హృదయం కలది. అందుకే పక్క భాష నటులు ఎంతమంది వస్తున్నా.. సినీ ఇండస్ట్రీ నుంచి తాత పేర్లు, నాన్న పేర్లు చెప్పుకొని బోలెడు మంది హీరోలు ఎంటర్ అవుతున్నా.. కానీ ఇంకా అవకాశాలు ఇస్తుంది. ఈ లిస్టులోకి వచ్చాడు అఖిల్. అక్కినేని ఇంటి పేరు వాడుకుంటూ తండ్రి నాగార్జున సపోర్ట్ తీసుకుంటూ.. ఎట్టకేలకు సక్సెస్ ఫుల్ గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యాడు యంగ్ హీరో అఖిల్ .

అయితే సక్సెస్ ఫుల్ గా అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు కానీ సక్సెస్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ అఖిల్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి అంటే ఒక్కటి కూడా పడలేదు. ఆఫ్ కోర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయింది. కానీ అది పూజా హెగ్డే ఖాతాలోకే పడిపోయింది. దీంతో అఖిల్ ని హీరో అని అసలు ఎవరు గుర్తుంచుకోలేదు . పూజ హెగ్డే అందాలు మైమరచిపోయి జనాలు ఆ సినిమాను హిట్ చేశారు.

ప్రజెంట్ ఏజెంట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు అఖిల్. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో అఖిల్ మరో రెండు సినిమాలు కమిట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేనట్టు తెలుస్తుంది. కాగా రీసెంట్ గా అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ కి సర్వం సిద్ధం చేసినట్లు ఓ న్యూస్ బీ టౌన్ లో వైరల్ గా మారింది. అంతేకాకుండా కరణ్ జోహార్, అఖిల్ బాలీవుడ్ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో కొందరు నెటిజన్స్ టాలీవుడ్ లోనే ఏం పీకలేనిది.. నువ్వు బాలీవుడ్ కి వెళ్లి ఏం పీకుతావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో అఖిల్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో ఆయన పరువు పోయేలా చేస్తుంది. మరి చూడాలి అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ పై అక్కినేని ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news