Moviesఅన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే సీజన్ 2 : టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్.....

అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే సీజన్ 2 : టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్.. ఆ పదం సూపరో సూపర్..అంతే..!!

“అదేదో సినిమాలో చెప్పినట్లు ఎప్పుడు వచ్చామా అన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా..? అన్నదే పాయింట్. సేమ్ అదే విధంగా ఎప్పుడు యాంకరింగ్ స్టార్ట్ చేశామా అన్నది కాదు జనాలని ఎంటర్టైన్ చేశామా లేదా ..అదే ముఖ్యం “అంటూ బాలయ్య తనదైన స్టైల్ లో ఫస్ట్ టైం హోస్టుగా చేసిన అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే సీజన్ 1 ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . అప్పటివరకు బాలయ్య ఒక నటుడిగా, ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా ఎంతో మందిని అలరించినటువంటి బాలయ్యలో.. యాంకర్ కూడా దాగి ఉన్నాడు అంటూ జనాలకు పరిచయం చేసింది ఆహా.

కాగా నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేసిన అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే స్టార్ట్ అయ్యాకే సబ్స్క్రైబర్లు పెరిగారు. భారీ రేంజ్ లో ఆహా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు త్వరలోనే బాలయ్య అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2 పేరిట మన ముందుకు రాబోతున్నాడు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన పాటను ఆహా అధికారికంగా రిలీజ్ చేసింది . ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో కొత్త ప్రోగ్రాం తో సరికొత్త షోస్ ను లాంచ్ చేసే ఆహా.. అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2 కోసం అదిరిపోయే టైటిల్ సాంగ్ ను జనాల కోసం అందించింది.

ఈ పాటను రోల్ రైడా మరియు మెహతి స్వర సాగర్ సమకూర్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ పాట బాలయ్యకు పిచ్చపిచ్చగా నచ్చేసింది.”నాకు ఈ పాట సూపర్ గా నచ్చింది అంటూ స్వయాన బాలయ్యనే చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ పాటలో మరీ ముఖ్యంగా బాలయ్య లుక్స్ , డైలాగ్స్ , అన్‌స్టాప‌బుల్‌ అనే పదం చాలా హైలెట్ గా మారింది . ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి బాలయ్య పిక్స్ బాలయ్య డైలాగ్స్ యాడ్ చేసి రోల్ రైడర్ అద్భుతంగా పాడారు, మరి ఎందుకు ఆలస్యం బాలయ్య కు నచ్చిన .. అభిమానులు మెచ్చిన అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2 టైటిల్ సాంగ్ పై మీరు ఓ లుక్కేయ్యండి..ఎంజాయ్ చేయ్యండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news