Moviesవిజయ్ ముద్దులు..అనన్య కొరుకుడు ..చమటలు పట్టిస్తున్న 'లైగర్‌' రొమాంటిక్ సాంగ్ 'ఆఫత్‌'...

విజయ్ ముద్దులు..అనన్య కొరుకుడు ..చమటలు పట్టిస్తున్న ‘లైగర్‌’ రొమాంటిక్ సాంగ్ ‘ఆఫత్‌’ ..!!

ఓ మై గాడ్,,పూరీ ఈజ్ బ్యాక్ అన్నాల్సిందే..ఈ పాట ను చూసి. ఇన్నాళ్లు ఈ పూరీ జగన్నాధ్ ఏమైపోయాడు అంటున్నారు జనాలు. లైగర్ సినిమాతో కొత్త భీబత్సాని సృష్టించడానికి రెడీ అయ్యాడు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.

మనకు తెలిసిందే.. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ..నెక్స్ట్ బాక్స్ ఆఫిస్ ని షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు లైగర్ సినిమాతో. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా..ఆగస్టు 25 న గ్రాండ్ ధియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఈ సినిమా టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనదైన స్టైల్లో విభిన్న రీతిలో తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ సినిమాను ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహ‌ర్‌-పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకునేలా చేసింది. “ఓ లయన్ కి టైగర్ కి పుట్టిన హై బ్రీడ్ గాడే ఈ సాలా లైగర్” అంటూ రమ్య కృష్ణ చెప్పే డైలాగ్ సినిమా కే హైలెట్ గా నిలిచింది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసింది లైగర్ టీం. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా..ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘ఆఫత్‌’ అంటూ సాగే ఈ పాటలో విజయ్‌ దేరకొండ, అనన్య పాండేల కెమిస్ట్రీ యూత్‌ను అట్రాక్ట్‌ చేసేలా ఉంది.

చాలా నాచురల్ గా..ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది పాట. ఈ పాటలో విజయ్ హీరోయిన్ కి ముద్దులు పెడుతుంటే..అనన్య ఏమో..మధ్యలో విజయ్ వేళుని కొరికేస్తుంది. అబ్బో ఆ సీన్ లొ కుర్రాళ్ళ గుండెలు జారిపోతాయంతే..చాలా రొమాంటిక్ గా బ్యూటిఫుల్ గా సాగిన ఈ పాట ఇప్పుడు నెట్టింట టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మరి ఎందుకు ఆలస్యం..ఈ పాట పై మీరు ఓ లుక్కేయ్యండి..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news