Movies"ఇక సెలవు"..అభిమానులకు రానా బిగ్ షాక్..!?

“ఇక సెలవు”..అభిమానులకు రానా బిగ్ షాక్..!?

టాలీవుడ్ హీరో కమ్ విలన్ రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి నిర్మాత గా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో..కొడుకు కూడా నటన పరంగా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు రానా నటనకి వంజలు పెట్టిన వారు లేరు. హీరో అయినా, విలన్ అయినా, రౌడి అయినా, లవర్ అయినా..క్యారెక్టర్ ఏదైన రానా రంగలోకి దిగ్గితే వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. అలాంటి పర్ ఫామెన్స్లు ఇస్తారు..రానా దగ్గుబాటి.

బాహుబలి సినిమాలో విలన్ గా రానా మెప్పించిన తీరు తరతరాలు అయిన మరువలేనిది. హీరో ప్రభాస్ కన్నా..డైరెక్టర్ రాజమౌళి కన్నా కూడా రానా నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా..అమరేంద్ర బాహుబలి పాత్ర కు తగ్గ రీతిలో భళ్లాల దేవుడిగా రానా నటించిన తీరు చాలా మంది ప్రముఖులకు నచ్చింది. మొన్న రిలీజ్ అయినా భీంలా నాయక్ సినిమా విషయంలోను అంతే. పవన్ కల్యాణ్ కన్నా ఎక్కువుగా హైలెట్ అయ్యాడు రానా. సినిమా సక్సెస్ కి సగం కారణం అయ్యాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన విరాట పర్వం సినిమా విషయంలోను అంతే. రానా నటన తీరు అందరిని మెప్పించింది. కమర్షీయల్ హిట్ కాలేదు కానీ..నటన పరంగా..మాత్రం రానా హిట్ కొట్టాడు. ఇప్పటికే రానా దర్శకుడు గుణశేఖర్‌తో ‘హిరణ్య కశ్యప’, దర్శకుడు మిలింద్‌ రావుతో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలి సిందే. అలాగే ‘కోడిరామ్మూర్తి’ బయోపిక్, తేజ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రజెంట్ రెండు సినిమాలతో బిజీ గా ఉన్న ఈ హీరో..అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇక పై సోషల్ మీడియాలో కనిపించను అంటూ బిగ్ బాంగ్ పేల్చారు. ఇది శాస్వతంగా కాదులేండి..కేవలం చిన్న బ్రేక్ నే అని కూడా చెప్పుకొచ్చాడు. “పని జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు సోషల్‌ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నా. సినిమాలతో కలుద్దాం. బిగ్గర్‌.. బెటర్‌.. స్ట్రాంగర్‌’ అంటూ రానా తనదైన స్టైల్ లో ట్వీట్‌ చేసి అభిమానులకు షాకిచ్చాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news