Moviesబింబిసార ఫస్ట్ డే కలెక్షన్లు: కుమ్మేసిన నందమూరి హీరో ..టెర్రిఫిక్...

బింబిసార ఫస్ట్ డే కలెక్షన్లు: కుమ్మేసిన నందమూరి హీరో ..టెర్రిఫిక్ స్టార్ట్..!!

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం భారీ బడ్జెట్ మూవీనే ఈ ‘బింబిసార’. మొదటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ మూవీ ..నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్ అనే క్యాప్ష‌న్ తో ప్రజలముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాని నమోదు చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ట్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటించారు.

భారీ అంచనాల మధ్య ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. ఇన్నాళ్ళ కల్యాణ్ రామ్ కెరీర్ లో ఇలాంటి పాజిటివ్ టాక్ ఏ సినిమాకి రాలేదు. ఫస్ట్ షో తోనే..బంపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. సినిమా మొత్తానికి వన్ మ్యాన్ ఆర్మీలా వ్యవహరించాడు కల్యాణ్ రామ్. ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం..మనకు కళ్లకు కట్టిన్నట్లు కనిపిస్తుంది. ఆయన కషాటానికి తగ్గ ఫలితం లభించింది.

మొదటి రోజు ఈ సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజే హిట్‌ టాక్‌ రావడంతో బ్రేక్‌ ఈవెన్‌ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ‘బింబిసార’ తొలి రోజు కలెక్షన్స్‌..

► నైజాం – రూ.2.15 కోట్లు

► సీడెడ్ – రూ.1.29 కోట్లు

► ఈస్ట్ – రూ.43 లక్షలు

► వెస్ట్ – రూ.36 లక్షలు

► ఉత్త‌రాంధ్ర – రూ.90 లక్షలు

► గుంటూరు- రూ.54 లక్షలు

► కృష్ణా – రూ. 34 లక్షలు

► నెల్లూరు – రూ.26 క్షలు

► కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా- రూ.0.32 లక్షలు

► ఓవర్సీస్‌ రూ.65లక్షలు

► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 7.27 కోట్ల షేర్‌ (రూ.11.50 కోట్ల గ్రాస్‌)

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news