Moviesఓ మై గాడ్..ఒక్క సంతకం ..50 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి..!?

ఓ మై గాడ్..ఒక్క సంతకం ..50 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి..!?

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. కొత్త హీరోయిన్లు వస్తున్నారు. కానీ ఎవ్వరికి వారే కొన్ని లిమిట్స్ పెట్టుకుని ఇండస్ట్రీలోకి వచ్చినా..మళ్ళీ అవకాశాల కోసం వాళ్లే అవన్ని..చెరిపేసి..కొత్త ఫార్ములా ను వెత్తుకుంటారు. ఇప్పటి వరకు వచ్చిన హీరోయిన్లు అంతా ఇంతే. ఓ వైపు సినిమాలు..మరో వైపు యాడ్స్ చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తూ ఉంటారు. కోట్లు వెనకేసుకుంటారు. కానీ, సాయి పల్లవి అందరిలోకి ప్రత్యేకం.

ఎవ్వరి మాట అస్సలు వినదు..డబ్బు ఎర చూపితే అస్సలకే వినదు. మొండి ఘట్టం. తాను అనుకున్న పని చేసి తీరే రకం. నిజంగా సాయి పల్లవి ఈ రోజుల్లో పుట్టాల్సిన అమ్మాయి. ఆమె ఆలోచనలు, పద్ధతులు, ఆచరణలు ఎప్పుడో సావిత్రి కాలాన్ని తలపిస్తాయి.డబ్బు అంటే సాయి పల్లవి కి మోజు లేదు..అందుకే ఇండస్ట్రీలో ఎన్ని బడా అవకాశాలు వచ్చినా..ఆమె మాత్రం కధ నచ్చకపోతే ఒక్క సంతకం కూడా చేయదు. చిరంజీవి లాంటి స్టార్ హీరో కే నో చెప్పిన మలర్ బ్యూటి..ప్రస్తుతం వరుస ఫ్లాప్ సినిమాలు ఖాతాలో వేసుకుని ఉంది. కానీ, అమ్మడు ఏ మాత్రం భయపడటం లేదు.

కాగా, సాయి పల్లవి ఇండస్ట్రీకి వచ్చి..ఇన్నేళ్ళు గడుస్తున్నా కనీసం ఆమెకంటూ 10 లక్షలు కూడా ఖర్చుపెట్టుకోలేదు. అంతేకాదు..ఈమె తమ సిద్ధాంతాల కారణంగా మొత్తం 50కోట్లు నష్టపోయిన్నట్లు అంచనా వేస్తున్నారు. హీరోయిన్ గా పరిశ్రమలో ఉండాలంటే తమ ఇష్టాలు, సిద్ధాంతాలు వదిలేయాలని, గుడ్డిగా దర్శకులు చెప్పినట్లు నడుచుకోవాలనే రూల్ ఆమె బ్రేక్ చేశారు. మంచి మంచి ఆఫర్స్ చేతులారా వదులుకున్న కారణంగా అమ్మడు సుమారు 50 కోట్లు నష్ట పోయిన్నత్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news