Movies' లైగ‌ర్ ' సెన్సార్ పూర్తి... పూరి మార్క్ ర‌న్ టైం...

‘ లైగ‌ర్ ‘ సెన్సార్ పూర్తి… పూరి మార్క్ ర‌న్ టైం ఫిక్స్ ..!

యంగ్ సెన్సేషన్, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగ‌ర్‌. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ సినిమాకు సాలా క్రాస్ బ్రీడ్ అన్న‌ది ఉప శీర్షిక‌. పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు నార్త్‌లో క‌ర‌ణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామిగా యాడ్ కావ‌డంతో పాన్ ఇండియా లెవ‌ల్లోనే రిలీజ్‌కు ముంద భారీ హైప్ తెచ్చుకుంది.

ఈ సినిమా నుంచి విడుద‌ల అయిన స్టిల్స్‌, టీజ‌ర్లు, వీడియోలకు ప్రేక్ష‌కుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని ఒక్క‌టే ఉత్కంఠ‌తో వెయిటింగ్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి లైగ‌ర్‌కు యూ/ఎ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. లైగ‌ర్ ర‌న్ టైం 2 గంటల 20 నిమిషాలు ఉంది.

140 నిమిషాల ర‌న్ టైం అంటే పూరి సినిమాలు కాస్త త‌క్కువ ర‌న్ టైంతో క్రిస్పీగానే ఉంటాయి. ర‌న్ టైం విష‌యంలో లైగ‌ర్‌కు ప్ల‌స్ పాయింటే అని చెప్పాలి. ఇక సినిమాకు విజయ్ దేవరకొండ మేకొవర్ స్పెషల్ అట్రాక్షన్ కాగా, పూరి జగన్నాథ్ టేకింగ్, లెజెండ‌రీ మైక్ టైస‌న్ రోల్ సినిమాకు మ‌రింత క్రేజ్ తీసుకువ‌చ్చింది.

ఇక సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ విజ‌య్‌కు త‌ల్లిగా న‌టిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైల‌ర్‌తో హైప్ ఎక్క‌డికో వెళ్లి పోయింది. ఇక ఈ నెల 25న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోన్న లైగ‌ర్ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news