Moviesటాలీవుడ్ రాజ‌కీయాల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌..!

టాలీవుడ్ రాజ‌కీయాల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌..!

ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఈ రోజు స్టార్ హీరోల‌కే స‌వాల్ విసురుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత‌గోవిందం ఇలా వ‌రుస హిట్ల‌తో తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవ‌ల్లో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను పూరితో పాటు బాలీవుడ్ బ‌డా ప్రొడ్యుస‌ర్ క‌ర‌ణ్ జోహ‌ర్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సౌత్‌తో పాటు నార్త్‌లోనూ లైగ‌ర్ మీద భారీ అంచ‌నాలు ఉన్నాయి. లైగ‌ర్ త‌ర్వాత శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత‌తో క‌లిసి ఖుషీ సినిమా చేస్తున్నాడు. ఆ వెంట‌నే మ‌రోసారి పూరితో క‌లిసి మ‌రో పాన్ ఇండియా సినిమా జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా చేయ‌నున్నాడు. ఇక ఇటీవ‌లే రిలీజ్ అయిన లైగ‌ర్ ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో విజ‌య్ తాత‌, బాబు అంటూ చేసిన కామెంట్లు కాంట్ర‌వ‌ర్సీగా మారాయి.

అయినా కూడా విజ‌య్ ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఇక ఇప్పుడు మ‌రోసారి విజ‌య్ టాలీవుడ్‌లో ఉన్న రాజ‌కీయాలు, డ్రామాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. కోవిడ్ వ‌ల్ల చాలా ఇబ్బందులు త‌లెత్తాయి. అలాగే చెప్ప‌లేని చాలా సంఘ‌ట‌న‌లు కూడా జ‌రిగాయి. ఇండ‌స్ట్రీలో ఇలాంటి డ్రామాలు, పాలిటిక్స్ చాలానే న‌డుస్తుంటాయ‌ని.. ఎక్క‌డికి వెళ్లినా ఈ డ్రామాలు ఉంటాయి.. ఆ డ్రామాలు చేసే వాళ్ల‌కు వాట్ లాగా దేంగే అనే స్పిరిట్ తో ఈ సినిమా చేశాన‌ని విజ‌య్ చెప్పాడు.

విజ‌య్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎవ‌రిని ఉద్దేశించి చేశాడా ? అన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. విజ‌య్‌ను ఇండ‌స్ట్రీలోనే ఓ ఫ్యామిలీకి చెందిన కొంద‌రు హీరోల‌కు చెందిన టీం టార్గెట్ చేసింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అలాగే విజ‌య్‌తో గ‌తంలో క‌లిసి న‌టించిన మ‌రో హీరోతో కూడా అత‌డికి స‌రిప‌డ‌డం లేద‌న్న టాక్ ఉంది.

ఈ క్ర‌మంలోనే విజ‌య్ తాను ప‌డిన అవ‌మానం, క‌ష్టాలు, నాకు ఎదురైన అడ్డంకుల‌కు తాను కృత‌జ్ఞుడిని అని విజ‌య్ చెప్పాడు. ఏదేమైనా విజ‌య్ కామెంట్లు ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Latest news