Moviesప్రభాస్ మీద ఆశ‌లు పెట్టుకుని మోస‌పోతోన్న మ‌ల‌యాళ బ్యూటీ... ఏం జ‌రిగిందంటే...!

ప్రభాస్ మీద ఆశ‌లు పెట్టుకుని మోస‌పోతోన్న మ‌ల‌యాళ బ్యూటీ… ఏం జ‌రిగిందంటే…!

ప్రభాస్‌ను నమ్మి మోసపోతున్న మలయాళ బ్యూటీ..? ఎవరైనా ఉన్నారా అంటే ఆమె మాళవిక మోహనన్. అవును బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్‌కి దక్కిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పటి నుంచి ఆయన సరసన సినిమా ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ హీరోయిన్స్ పట్ల చాలా సున్నితంగా ఉంటారు. ఆయన షూటింగ్ సమయంలో ఇచ్చే విందు కూడా గొప్పగా ఉంటుంది.

ప్రభాస్ సినిమా కావాలనుకోవడానికి కూడా ఇది మరొక కారణం. ఆయన సరసన హీరోయిన్‌గా నటిస్తే పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ వస్తుందని ఆశపడుతున్నారు. అయితే, అందరికీ ఆ అవకాశం దక్కడం లేదు. కొందరికేమో అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అవుతోంది. అలాంటి వారిలో మాళవిక మోహనన్ కూడా ఉన్నారు. గతంలో మాళవికకి ఓ సినిమాలో అవకాశం వచ్చినట్టే వచ్చి జారింది.

మాళవిక తమిళంలో హీరోయిన్‌గా మంచి పాపులర్ అయింది. అయితే, ఆ తర్వాత అక్కడ కూడా ఆశించిన అవకాశాలు దక్కలేదు. అయితే అందాల ఆరబోతతో మాత్రం సోషల్ మీడియాలో మోత మోగిస్తోంది. భారీ ఎద అందాలతో మాస్ ఆడియన్స్‌ను మేకర్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే, గత కొన్నిరోజులుగా ప్రభాస్ సినిమా కోసం ఆమె ఎదురుచూస్తుందట. మారుతి – ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా కోసం మాళవిక మోహనన్‌ని మేకర్స్ సంప్రదించారట.

ఇంకా కన్‌ఫర్మ్ చేయనప్పటికీ ప్రభాస్ సినిమా కాబట్టి చాలా ఆశలు పెట్టుకుందని అంటున్నారు. అయితే, తనకి అటు కమర్షియల్‌గా, ఇటు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ లేకపోవడంతో మేకర్స్ మళ్ళీ ఆలోచిస్తున్నారట. చూడాలి మరి అమ్మడు డార్లింగ్ మీద పెట్టుకున్న ఆశలు ఏమవుతాయో. ఒకవేళ ప్రభాస్ గనక మాళవికకి ఛాన్స్ ఇచ్చి ఆ సినిమా హిట్ అయితే, మాళవిక కెరీర్ టాలీవుడ్‌లో బాగానే సెటిలవుతుంద‌నే చెప్పాలి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news