Moviesనిఖిల్ దెబ్బ‌కు చేతులెత్తేసిన నితిన్‌.. ఘోరంగా ' మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం '...

నిఖిల్ దెబ్బ‌కు చేతులెత్తేసిన నితిన్‌.. ఘోరంగా ‘ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ‘ క‌లెక్ష‌న్లు..!

యంగ్ హీరో నితిన్ గత నాలుగైదు యేళ్లుగా బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. నితిన్ చివరి రెండు సినిమాలు చెక్ – రంగ్ దే రెండు కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ క్రమంలోనే కొత్త దర్శకుడు ఎంఎస్‌. రాజశేఖర్ రెడ్డిని దర్శకుడుగా పరిచయం చేస్తూ తన హోం బ్యాన‌ర్ శ్రేష్ట్‌ మూవీస్ లో నిర్మించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఇప్పటికే సీనియర్ ఎడిటర్ గా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కేథరిన్ మరో హీరోయిన్‌గా నటించగా… అంజలి రారారెడ్డి అనే స్పెషల్ ఐటెం సాంగ్ లో ఆడి పాడింది.

మాస్ – యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన మాచర్ల నియోజకవర్గం శుక్రవారం తొలి ఆటకే డిజ‌ప్పాయింట్ టాక్‌ తెచ్చుకుంది. ప్రేక్షకులతో పాటు సినిమా రివ్యూవర్ల నుంచి కూడా నెగ‌టివ్ టాక్‌ సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే సినిమా చాలా నిరాశపరిచిందని తేలిపోయింది. అయితే తొలిరోజు భారీ అంచనాలతో రిలీజ్ కావడంతో ఐదు కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు మరో యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ప్రభావం మాచర్ల నియోజకవర్గం పై గట్టిగా పడింది.

రెండో రోజు మాచర్ల కేవలం 1.62 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే రెండు రోజులకు మాచర్ల నియోజకవర్గం రు. 6.69 కోట్లు రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రు. 22 కోట్ల షేర్ రాబట్టాలి. అయితే ఇప్పుడు కార్తికేయ 2 దూకుడు చూస్తుంటే నితిన్ అందులో సగం కూడా రాబడతాడు అన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే చాలా చోట్ల మాచర్ల షోలు తగ్గించేసి.. కార్తికేయ 2 – బింబిసార – సీతారామం షోలు పెంచుతున్నారు. ఏదేమైనా నితిన్ కెరీర్‌లో వరుసగా మూడో ప్లాప్ తప్పేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news