Moviesఅవి మొత్తం ఎడిటింగ్ లో లేపేశారు..అందుకే షో నుండి తప్పుకున్న..అనసూయ బిగ్...

అవి మొత్తం ఎడిటింగ్ లో లేపేశారు..అందుకే షో నుండి తప్పుకున్న..అనసూయ బిగ్ బాంబ్..!!

అనసూయ..ఈ పేరు ఇప్పుడు స్టార్ హీరోయిన్ల కన్నా ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ..ఆ తరువాత మెల్లగా మెల్లగా..జబర్ధస్త్ లోకి యాంకర్ గా వచ్చి..చేతికి వచ్చిన సినిమాల్లో నటిస్తూ..తన అద్భుతమైన టాలెంట్ తో..ఇప్పుడు హీరోయిన్స్ కే గట్టి పోటీ ఇస్తుంది. అనసూయ అనగానే మనకు ముందు గుర్తు వచ్చేది జబర్ధస్త్.. ఆ షోలో ఆమె పంచులు..జోకులు..డ్రెస్సింగ్ స్టైల్ ..అబ్బో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.

దాదాపు షో పెట్టిన మొదలు నుండి..మొన్నటి వరకు యాంకర్ గానే కొనసాగుతూ వచ్చినా ..రీసెంట్ గానే షో కి గుడ్ బై చెప్పేసింది. దాదాపు 9 ఏళ్లు యాంకర్ గా కొనసాగిన అనసూయ ఇలా ఉన్న పలంగా షో నుండి తప్పుకోవడం చాలా ప్రశ్నలకు తావుతీసింది. జనాలు ఏవేవో ఊహించుకుని..ఉన్నవి లేనివి అనసూయ పై అంటగట్టారు . ఈ క్రమంలోనే.. అనసూయా స్ట్రాంగ్ గా అందరికి ఆన్సర్ ఇచ్చింది.

తాను జబర్ధస్త్ షో ఎందుకు మానేయాలి అనుకునిందో ..దానికి కారణాలు చెప్పి..జనాలకి మైండ్ బ్లాకింగ్ షాకిచ్చింది. షో లో అందరి గురించి కూల్ కామెంట్స్ చేసిన అనసూయ..కొన్ని సంధార్భాలల్లో మితిమీరిన బాడీ షేమింగ్, హద్దులు దాటిన కామెంట్స్ వల్లే..షో నుండి తప్పుకోవాలి అనుకున్నాను అంటూ బిగ్ బాంబ్ పేల్చింది.”కొందరి కామెడియన్స్ బాడీ షేమింగ్ కామెంట్స్ వల్ల బాధపడ్డాను. నా అసహనం మాత్రం ఎడిటింగ్ లో తీసేసి ప్రేక్షకులు తెలియనిచ్చేవారు కాదు..”అంటూ చెప్పుకొచ్చింది. అయితే, దీని పై నెటిజన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు గుర్తు రానీ బాడీ షేమింగ్ కామెంట్స్ ఇప్పుడే గుర్తు వచ్చాయా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news