Moviesముగ్గురు మెగాహీరోలు ఒకేసారి మ‌న‌సు ప‌డ్డ హాట్ హీరోయిన్‌... ఇంత క‌థ...

ముగ్గురు మెగాహీరోలు ఒకేసారి మ‌న‌సు ప‌డ్డ హాట్ హీరోయిన్‌… ఇంత క‌థ ఉందా…!

యంగ్ హీరోయిన్స్ ఎవరైనా వచ్చారంటే మొదటి సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుంచే హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతలందరి దృష్ఠి గట్టిగా పడుతుంది. మొదటి సినిమా హిట్ అయితే, ఆ అమ్మాయికి పాజిటివ్ కామెంట్స్ వస్తే, అడ్వాన్స్ ఇచ్చి వారి సినిమాలో పెట్టుకునేందుకు క్యూ కడుతుంటారు. పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్‌కైతే కాస్త క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. సాంగ్స్‌లో, సీన్స్‌లో ఆయన చూపించే గ్లామర్, హాట్‌నెస్, అందరూ వెంటపడేలా చేస్తాయి. అలా రొమాంటిక్ సినిమాతో లైం లైట్‌లోకి తీసుకొచ్చిన హీరోయిన్ కేతిక శర్మ.

కేతిక నిజంగానే చాలా రొమాంటిక్. సినిమా ఫ్లాపవడం కాస్త మైనస్ అయింది గానీ. అదే రొమాంటిక్ సినిమా సూపర్ హిట్ గనక అయితే, ఇప్పుడు కృతిశెట్టిని గ్యారెంటీగా తొక్కేసి ఉండేది. అంతగా తనలోని రొమాంటిక్ యాంగిల్స్ యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ సినిమాలో బోల్డ్ సీన్స్‌తో కేతిక చమటలు పట్టించింది. అందుకే, సినిమా ఫ్లాపైనా కూడా రొమాంటిక్ బ్యూటీగా అవకాశాలు అందుకుంటుంది.

రొమాంటిక్ తర్వాత నాగ శౌర్య హీరోగా వచ్చిన లక్ష్య మూవీలో నటించింది. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. రంగ రంగ వైభవంగా అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ఈ రొమాంటిక్ బ్యూటీని మరో మెగా హీరో కూడా కావాలని అడిగాడట. ఆ హీరో మరెవరో కాదు సాయి ధరం తేజ్. తమ్ముడి సినిమాలో నటించి మెగా ఫ్యామిలీకి కాస్త క్లోజ్ అయింది కేతిక.

దాంతో పవన్ కళ్యాణ్ నటిస్తూ, నిర్మిస్తున్న తమిళ సూపర్ హిట్ సినిమా వినోదాయ సీతం తెలుగు రీమేక్‌లో సాయి ధరం తేజ్‌కి జంటగా కేతికను తీసుకున్నట్టు సమాచారం. ఒక్క మెగా హీరోతో నటించిన యంగ్ బ్యూటీ ఆ తర్వాత అల్లు అర్జున్, రాం చరణ్, సాయి ధరం తేజ్‌లతో నటించే ఛాన్స్ కొట్టేస్తుంది. అలా ఇప్పుడు మెగా హీరోలు కేతిక శర్మకి అవకాశాలిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా అమ్మడు సక్సెస్ అయితే కొంతకాలం ఇండస్ట్రీలో నెట్టుకొస్తుంది. ఇంత రొమాంటిక్ బ్యూటీని ఆడియన్స్ కూడా వరుస సినిమాలలో చూసేందుకే రెడీగా ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news