Moviesఆ స్టార్ హీరోయిన్ల‌తో ప్రేమాయణం నడిపించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.....

ఆ స్టార్ హీరోయిన్ల‌తో ప్రేమాయణం నడిపించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. మామూలు లవ్ స్టోరీస్ కాదుగా ..!

సినిమా హీరోల కంటే ఎక్కువ‌గా హీరోయిన్లు క్రికెట‌ర్ల‌తో ప్రేమాయ‌ణాలు న‌డిపిస్తుంటారు. హీరోల‌కు కేవ‌లం దేశంలోనే క్రేజ్ ఉంటుంది. కానీ క్రికెట‌ర్ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. క్రేజ్ కోస‌మో మ‌రెందుకో కానీ హీరోయిన్లు మాత్రం క్రికెట‌ర్లు అంటే ప‌డిచ‌చ్చిపోతారు. ఒక‌ప్ప‌టి క్రికెట‌ర్ల నుంచి ఇప్ప‌టి ప్లేయ‌ర్ల వ‌ర‌కూ హీరోయిన్ల‌తో ల‌వ్ ఎఫైర్లు పెట్టుకున్న‌వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక కొంత‌మంది పెళ్లిళ్లు చేసుకుంటే మ‌రికొంద‌రు మాత్రం డేటింగ్…. మీటింగ్ అంటూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగి ఆ త‌ర‌వాత ఎవరిదారి వాళ్లు చూసుకుంటారు. ఒక‌ప్ప‌టి పాకిస్థాన్ క్రికెట‌ర్ మాజీ పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఆ విష‌యంలో మామూలోడు కాదు.

ఏకంగా ఇద్ద‌రు బాలీవుడ్ హీరోయిన్ ల‌ను త‌న వెంట తిప్పుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ ప్ర‌పంచంలోనే టాప్ స్పీడ్‌ బౌల‌ర్ గా అప్ప‌ట్లో రికార్డులు క్రియేట్ చేశాడు. అత‌డి ఆట‌కు అంద‌రూ ఫిదా అయ్యేవాళ్లు. ఇక క్రికెట్ లో ఇమ్రాన్ హ‌వా న‌డుస్తున్న కాలంలో బాలీవుడ్‌లో హీరోయిన్ జీన‌త్ స్టార్ హీరోయిన్ గా రానిస్తోంది. ఓ రోజు క్రికెట్ మ్యాచ్ కోసం ఇమ్రాన్ ఖాన్ ఇండియాకు వ‌చ్చాడు. కాగా స్టేడియంలో హీరోయిన్ జీన‌త్‌ను చూసిన ఇమ్రాన్ ఫ‌స్ట్ లుక్ లోనే ఫ్లాట్ అయ్యాడ‌ట‌. జీన‌త్ కూడా ఇమ్రాన్ ఆట‌కు అత‌డి స్టైల్ కు ప‌డిపోయింది.

ఇంకేముంది ఆ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌న‌సులు క‌లవ‌డం ఆ త‌ర‌వాత చెట్టాప‌ట్టాలేసుకుని తిరగ‌టం జ‌రిగిపోయాయి. కానీ ఆ త‌ర‌వాత ఏం జ‌రిగిందో ఏమో కానీ జీన‌త్ వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. దాంతో ఇమ్రాన్ కూడా వేరొక‌రిని పెళ్లి చేసుకున్నాడు. అంతే కాకుండా ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ రేఖ‌తోనూ ప్రేమాయ‌ణం న‌డిపార‌ని అప్ప‌టి మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇది కూడా అప్ప‌ట్లో ఓపెన్ సీక్రెట్ గా మారింది. రేఖ అంటే అప్ప‌ట్లో బాలీవుడ్‌లో ఓ అందాల రాశి. ఆమెకు అమితాబ్‌, ఆ త‌ర్వాత అక్ష‌య్ కుమార్‌తో ఎఫైర్లు ఉన్నాయి.

అక్ష‌య్ త‌ర్వాతే ఆమె ఇమ్రాన్‌తో కొద్ది రోజులు ప్రేమ‌లో ఉండ‌డంతో పాటు ఎఫైర్ కూడా పెట్టుకుంద‌ని అంటారు. కేవ‌లం ఈ ఇద్ద‌రు హీరోయిన్ లు మాత్ర‌మే కాదు ఇమ్రాన్ ఖాన్ లిస్ట్ లో మ‌రి కొంద‌రు కూడా ఉన్నార‌నే ప్ర‌చారం కూడా ఉంది. ఇక క్రికెట్లో రాణించిన ఇమ్రాన్ ఖాన్ ప్ర‌ధాని కుర్చీపై కూర్చున్నా స‌రిగ్గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌లేక ఆ ప‌ద‌విని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. అటు ఇమ్రాన్ వ్య‌క్తిగ‌త జీవితం కూడా ఫెయిల్ అయ్యింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news