Moviesనాగచైతన్య లైఫ్ లో అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు.. హిట్...

నాగచైతన్య లైఫ్ లో అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు.. హిట్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!!

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. స్టార్స్ గా ఉన్న హీరోలు జీరోలు అవుతారు. హీరోలుగా ఉన్న స్టార్స్ జీరోలు అవుతారు . రాత్రికి రాత్రి ఏవైనా జరగొచ్చు. అందుకే ఈ ఇండస్ట్రీని అంత ఈజీగా ఎవ్వరూ నమ్మరు. ఏ హీరో పోజీషన్ కూడా సేఫ్టీ కాదు. ప్రజెంట్ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. స్టార్ డైరెక్టర్లే కాదు యంగ్ డైరెక్టర్లు కూడా హిట్లు కొడుతున్నారు. అలాంటి లిస్టులోకి వస్తారు ఈ డైరెక్టర్ చందు మొండేటి.

ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టమేమో.. కానీ, కార్తికేయ సినిమా పేరు చెప్తే మాత్రం అందరూ టక్కున గుర్తుపడతారు. అప్పుడెప్పుడో కార్తికేయ సినిమాతో హిట్టుకొట్టిన ఈయన రీసెంట్ గా.. కార్తికేయ 2తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆగస్టు 13న గ్రాంఘ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. పక్కాగా చెప్పాలంటే బాక్స్ ఆఫిస్ వద్ద తాండవం చేస్తుంది. ఈ సినిమా హిట్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ చందు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ డైరెక్టర్ మాట్లాడుతూ..షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు.

గతంలో అక్కినేని కుర్రాడు నాగచైతన్య తో ప్రేమమ్, సవ్యసాచి లాంటి సినిమాలు తీసిన ఈయన.. పెద్దగా సక్సెస్ అందుకోళేకపోయాదు. నిజానికి నాగచైతన్య కెరీయర్ లో ఈయన డైరెక్షన్ లో రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి ప్రేమమ్.. మరొకటి సవ్యసాచి రెండో సినిమా లు ఫ్లాప్ అయ్యాయి. ప్రేమమ్ పర్లేదు అనిపించిన సవ్యసాచి మాత్రం అట్టర్ ప్లాప్ అయింది. అయితే సవ్యసాచి సినిమా ఫ్లాప్ అవుతుందని సినిమా రిలీజ్ అయ్యే ఐదు రోజులు ముందే ఈ డైరెక్టర్ కు తెలిసిందట.

సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈయనకు కరెక్ట్ గా సినిమా రిలీజ్ అయ్యే ఐదు రోజులు ముందే సినిమా.. మనం అనుకున్నంత స్థాయి హిట్ అవ్వదని గెస్ చేశారట. అయితే సినిమా హిట్ అయితే బాగుండని కోరుకున్నారట . కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. సినిమా స్క్రిప్ట్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయని,, అందుకే ఈ సినిమా సగం మంది జనాభా కి అర్థం కాకుండా ఉందని చాలామంది జనాలు రివ్యూ ఇచ్చారు. అయితే కార్తికేయ 2 రిలీజ్ అయిన తర్వాత మాత్రం చందు పేరు ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాల పై బోలెడు ఆశలు పెట్టుకోనున్నారు అభిమానులు. మరి చూడాలి నెక్స్ట్ సినిమా ఏ స్థాయిలో తీయబోతాడు ఈ డైరెక్టర్..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news