Moviesఓ మై గాడ్: కార్తికేయ 2 అన్బిలీవబుల్ రికార్ట్..ఇది ఎవ్వరూ ఊహించని...

ఓ మై గాడ్: కార్తికేయ 2 అన్బిలీవబుల్ రికార్ట్..ఇది ఎవ్వరూ ఊహించని సంచలనం..!!

యంగ్ హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రమే కార్తికేయ 2. గతంలో హీరో నిఖిల్ కెరియర్ లోనే బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకి ఇది సీక్వెల్. 2014లో విడుదలైన కార్తికేయ సినిమా ఎలాంటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే ఈ కార్తికేయ 2. ఆగస్టు 13న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది.

మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కార్తికేయ 2.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ స్థాయిలో పాజిటీవ్ కామెంట్స్ అందుకోవడం ..అంతకంటే భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం.. బిగ్ స్టార్స్ సినిమాలను సైతం వెనక్కి నెట్టడం ..ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కేవలం 50 స్క్రీన్ లతో విడుదలైన కార్తికేయ 2 ఇప్పుడు ఏకంగా వెయ్యి స్క్రీన్ లకు చేరుకుంది. అంటే దీనిబట్టి సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

హిందూ తత్వం.. శ్రీకృష్ణసారం వంటి అంశాలతో ఉత్తరాదిన కూడా ఈ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కార్తికేయ 2 ద్వారా హీరో నిఖిల్. కాగా ఈ సినిమా కలెక్షన్స్ మైండ్ బ్లోయింగ్ రికార్డును సొంతం చేసుకుంది .ఇప్పటివరకు ఓవర్సీస్ లో శుక్రవారం అత్యధిక వసూలు సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డును నమోదు చేస్తే.. ఆ తర్వాత అత్యధిక స్థాయి కలెక్షన్స్ సాధించిన సినిమాగా కార్తికేయ 2 రికార్డ్ బద్దలు కొట్టింది . నిఖిల్ లాంటి ఓ సాధారణ హీరో ఇలాంటి రికార్డ్స్ సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు.

బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తికేయ2 అన్ రిమార్కబుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కార్తికేయ 2 సినిమా రెండో శుక్రవారం అమెరికాలో ఎక్సలెంట్ గ్రోత్ ను చూసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నయ్. ఈ ఇయర్ కి గాను ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో ఉంటే సెకండ్ హైయెస్ట్ ఫ్రైడే కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా కార్తికేయ2 నిలిచింది. కార్తికేయ 2 ఈ రెండో శుక్రవారం ఓవర్సీస్ లో దుమ్ము దులిపేసింది.కే జి ఎఫ్ 2 సినిమా కలెక్షన్స్ ని సైతం వెనక్కి నెట్టింది అనే చెప్పాలి. ఈ ఇయర్ రిలీజైన స్టార్ హీరో సినిమాల పరంగా రెండో శుక్రవారం అత్యధిక వసూలు సాధించిన సినిమాగా కార్తికేయ2 సంచలన రికార్డు నమోదు చేసింది. మొత్తంగా కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో శుక్రవారం ఏకంగా 94 వేల డాలర్స్ ని సొంతం చేసుకున్నట్టు సినిమా వర్గాలు చెబుతున్నాయి.

Karthikeya 2 Box Office Prediction: To continue the hit trend at the BO  Telugu - JanBharat Times

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news