Moviesసమంత విడాకుల పై సదా సంచలన కామెంట్స్..నిజమేగా అంటూ సపోర్ట్ చేస్తున్న...

సమంత విడాకుల పై సదా సంచలన కామెంట్స్..నిజమేగా అంటూ సపోర్ట్ చేస్తున్న నెటిజన్స్..!?

సదా ..సినీ ఇండస్ట్రీలోకి జయం సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత స్టార్ హీరో సినిమాల్లో బిగ్ బిగ్ అవకాశాలు అందుకుంటూ.. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ టైంలోని తన ఖాతాలో మంచి మంచి సినిమాలను వేసుకుంది. సదా లోని స్పెషల్ క్వాలిటీ ఏంటంటే.. ఏ క్యారెక్టర్ కైనా ఇట్టే సెట్ అయిపోతుంది. తనలోని స్పెషల్ టాలెంట్ ని సదా చాలా సినిమాలు ద్వారా బయటపెట్టింది . మరీ ముఖ్యంగా మొదటి సినిమా జయంలో అమ్ముడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి సినీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఫిదా అయింది.


ఆ తర్వాత హీరో మాధవం తో చేసిన ప్రియసఖి సినిమాలో అమ్మడు టూ హాట్ గా కనిపించింది. అప్పటి వరకు జయం సినిమాలో లంగా ఓణీతో కనిపించిన సదా.. ప్రియ సఖి సినిమాలో మాత్రం చడ్డీలు.. మిడ్డీలతో హాట్ లుక్స్ తో అదరగొట్టేసింది. ఆ తర్వాత అపరిచితుడు సినిమాతో మళ్లీ తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఎందుకో తెలియదు కానీ సదాకు సినిమా అవకాశాలు తగ్గాయి . తన వయసుకు మించిన స్టార్ హీరోలతోనే అమ్మడు సినిమాలు చేయడం కెరీయర్ కు మైనస్ అయ్యింది. కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సదా ఇప్పుడిప్పుడే బుల్లితెర షో ల తో మళ్ళీ లోకి వచ్చింది .

రీసెంట్ గా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తో మళ్లీ దుమ్ము దులుపుతుంది సదా. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు మాట్లాడుతూ ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్
గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. కాగా తన పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చిన రిపోర్టర్ తో సదా చెప్పిన ఆన్సర్ మైండ్ బ్లాకింగ్ గాఉంది.

సదా మాట్లాడుతూ..” ప్రజెంట్ లైఫ్ స్టైల్ లో పదిమంది పెళ్లి చేసుకుంటే 5 మంది మాత్రమే కలిసున్నారని.. మిగతా 5 మంది విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారని “చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ పరోక్షంగా సమంత చైతన్య విడాకులు పై ముడిపడి ఉండడం గమనార్హం. ఇదే పాయింట్ ను సోషల్ మీడియాలో పట్టేసుకున్నారు ట్రోలర్స్. అంతేకాదు తన కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా సదా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..” నా జీవితం నా చేతుల్లోనే ఉంది. నా లైఫ్ నేను చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నాను. పార్టీలకు పబ్బు లకు వెళ్ళను. ఆల్కహాల్ తీసుకోను నా జీవితం నాకు నచ్చినట్లే బ్రతకాలనుకుంటున్నాను. ఎవరో వచ్చి నా జీవితాన్ని ఉద్ధరించాలని అస్సలు అనుకోను. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి వెజిటేరియన్ ఉండాలని కోరుకుంటున్నాను.

డబ్బు లేకపోయినా పర్లేదు ..కానీ మంచి మనసు ఉండాలి. నా పై నా డబ్బు పై ఆధార పడకూడదు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్స్ కూడా సదాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె చెప్పిన దాంట్లో తప్పు లేదంటూ ప్రజెంట్ మ్యారేజ్ లైఫ్ స్టైల్ అలానే ఉందంటూ చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news