Moviesబింబిసార హ్యూజ్ హిట్..కల్యాణ్ రామ్ సంచలన ప్రకటన..ఫ్యాన్స్ కు ఢబుల్ పండగే..!!

బింబిసార హ్యూజ్ హిట్..కల్యాణ్ రామ్ సంచలన ప్రకటన..ఫ్యాన్స్ కు ఢబుల్ పండగే..!!

‘బింబిసార’..ఇప్పుడు ఈ పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా అందాల ముద్దుగుమ్మలు కేథ‌రిన్ – సంయుక్త మీన‌న్ కలిసి నటించిన సినిమానే ఈ “బింబిసార”. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పరిస్ధితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సరైన కలెక్షన్లు లేక బాక్సాఫీసు కాసుల పెట్టే ఖాళీ అయిపోయింది. అలాంటి టైంలో ఇండస్ట్రీకి కొత్త ఊపు నిచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ తన నట విశ్వ రూపాని చూయించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ బింబిసారా..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 

ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ అంటే మనకు గుర్తు వచ్చే నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. ఆ తరువాతనే కళ్యాణ్ రామ్ పేరు వినిపిస్తుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టార్‌డమ్ సంపాదించుకున్నా.. మధ్యలో కొన్ని వరుస ఫ్లాప్ సినిమాలతో వెనుకపడిపోయాడు ఈ హీరో. ఆ తరూఅవ్త పటాస్,118, ఇజం సినిమాల ద్వార పలకరించిన అవి నందమూరి రేంజ్ కు ఆనలేదు. దీంతో హీరోగా చెప్పుకొదగ్గ విజయం నందమూరి కళ్యాణ్ రామ్ కి దక్కలేదు. ఈ నేపథ్యంలోనే బింబిసార మూవీపై కళ్యాణ్ రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం ఊరికే పోలేదు. బాక్స్ ఆఫిస్ వద్ద సినిమా భారీ విజయం అందుకుంది. అంతేనా, కళ్యాణ్ రామ్ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డ్ నెలకోల్పింది. ఈ క్రమంలో బింబిసార మూవీ పై అభిమానులకు ఉత్సాహాని నింపే ప్రకటన చేసాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ సినిమా మరింత గ్రాండ్ లెవెల్లో ఉంటుంది అని క్లారిటీ కూడా ఇచ్చాడు. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై కూడా హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఈ భారీ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news