Moviesటాలీవుడ్ హిస్ట‌రీలో ఆ రికార్డ్ ఈ నంద‌మూరి సోద‌రులు ఇద్ద‌రిదే.. !

టాలీవుడ్ హిస్ట‌రీలో ఆ రికార్డ్ ఈ నంద‌మూరి సోద‌రులు ఇద్ద‌రిదే.. !

టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వాలంటేనే భయపడుతున్నారు. కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. అలాగే కొత్త దర్శకులు తమను సరిగా హ్యాండిల్ చేయలేరని చాలామంది హీరోలు భావిస్తూ ఉంటారు. అయితే నందమూరి హీరోలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. నటసింహం నందమూరి బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా కొత్త దర్శ‌కులను ప్రోత్సహించడంలో ముందుంటున్నారు.

బాలయ్య విజయేంద్ర వర్మతో స్వర్ణ సుబ్బారావు – మిత్రుడు సినిమాతో మహదేవ్ – లయన్ సినిమాతో సంగీత సత్యదేవ లాంటి కొత్త దర్శకులకు ఇటీవల కాలంలో ఛాన్స్ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తో భారతదేశం మెచ్చే దర్శకధీరుడు రాజమౌళి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు రాజమౌళి స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఎన్టీఆర్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమా ఆది సినిమాతో వివి వినాయక్‌ కూడా దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

ఇలా తారక్‌తో పరిచయం అయిన దర్శకులు ఈరోజు టాలీవుడ్‌ను శాసించే స్టార్ దర్శకులుగా మారారు.
అలాగే మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా కొత్త దర్శకులను పరిచయం చేయటంలో ఎప్పుడు ముందుంటున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మించిన అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఈ రోజు సురేందర్ రెడ్డి టాలీవుడ్ స్టార్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నారు.

పటాస్ సినిమాతో అనిల్ రావు పూడి దర్శకుడుగా కెరీర్ మొదలుపెట్టి ఈరోజు ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శికుడిగా ఉన్నారు. అలాగే మల్లికార్జున్ అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు అతడి ద‌ర్శ‌క‌త్వంలోనే ఏకంగా మూడు సినిమాల్లో క‌ళ్యాణ్ న‌టించాడు. కళ్యాణ్ రామ్ మల్లికార్జున కాంబినేషన్లో అభిమన్యు – షేర్ – కత్తి సినిమాలు వచ్చాయి. ఇక తాజాగా వచ్చిన బింబిసారా సినిమాతో ఎలాంటి అంచనాలు లేని మల్లిడి వశిష్ట్‌ అనే దర్శకుడిని కళ్యాణ్ రామ్ హీరోగా పరిచయం చేశాడు.

ఈ సినిమా కూడా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అలా నందమూరి సోదరులు ఇద్దరు ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఆరుగురు దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయగా… వీరిలో ఎక్కువమంది స్టార్ దర్శకులుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఈ అన్నదమ్ములకు ఎంతో గర్వకారణం. అలాగే ఈ అరుదైన సాహసం చేసిన ఘనత కూడా ఈ నందమూరి సోదరులకే దక్కుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news