Movies"సీతా రామం" లో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న దురదృష్టవంతురాలు ఈమె..!

“సీతా రామం” లో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న దురదృష్టవంతురాలు ఈమె..!

జనరల్ గా హీరో, హీరోయిన్స్ అన్నాక కొన్ని సినిమాలు మిస్ చేసుకుంటుంటారు. కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్నిసార్లు. కధ నచ్చక కొన్ని సార్లు మిస్ అవుతూ ఉంటారు. ఇక అలా వాళ్లు మిస్ అయిన సినిమాను మరో హీరో, హీరోయిన్స్ చేస్తే..ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే . మనం ఏ సినిమా కోసం వదులుకున్నామో ..ఆ సినిమా ఫ్లాప్ అయితే. ఆ బాధ చెప్పలేనిది..వివరించలేనిది. అనుభవిస్తేనే తెలుస్తుంది.

అలాంటి బాధనే అనుభవిస్తుంది ఇప్పుడు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. పాపం, ఈ బ్యూటీ కి ఈ మధ్య అన్ని వరుస ఫ్లాప్ సినిమాలే పడుతున్నాయి. వరుసగా మూడు బిగ్ డిజాస్టర్లు పడ్డాయి. అయితే తాజా రిలీజ్ అయిన సీతారామం సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకుంది ఈ బుట్టబొమ్మనే నట. ఆ టైంలో రాధేశ్యామ్ తో ఫుల్ బిజీ గా ఉన్న ఈ బ్యూటి..సినిమా కధ నచ్చినా ..కాల్ షీట్లు అడ్జెస్ట్ చేయలేక నో చెప్పిందట. ఇప్పుడు అదే సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమానే సీతారామం.వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ నిర్మాతగా.. సెన్నిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ ‘సీతా రామం’ సినిమా నిన్న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ డే డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది. బాక్స్ ఆఫిస్ వద్ద క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచింది. ఇంతటి మంచి సినిమాను మిస్ చేసుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడు బాధపడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news