Moviesబిగ్ షాకింగ్: ఆ సినిమా నుండి కూడా కాజల్ అవుట్..దిమ్మతిరిగే షాకిచ్చిన...

బిగ్ షాకింగ్: ఆ సినిమా నుండి కూడా కాజల్ అవుట్..దిమ్మతిరిగే షాకిచ్చిన డైరెక్టర్..!?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. అమ్మడు గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన టాలెంట్ తో అదిరిపోయే ఫిగర్ తో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ని ఓ రేంజ్ లో అల్లాడించింది . నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత రెండో సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మగధీర సినిమాలో మిత్రవిందగా రాణి పాత్రలో,ఇందుగా మోడ్రన్ అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది కాజల్ అగర్వాల్.

ఈ సినిమా ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా నుంచి ఇక కాజల్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. వరుస సినిమా అవకాశాలతో చేతిలో పది సినిమాలు కూడా హ్యాండిల్ చేసిన ఘనత దక్కించుకుంది కాజల్ అగర్వాల్ . తప్పో ఒప్పో కెరియర్ పిక్స్ లో ఉండగానే తాను ప్రేమించిన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కాజల్.. అంతే త్వరగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసుకొని ఓ బిడ్డకు జన్మని కూడా ఇచ్చేసింది. పెళ్లి తర్వాత కాజల్ చేసిన ఏకైక సినిమా ఆచార్య. అందులో కూడా ఆమెను తీసేసారు. కాగా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాజల్ అగర్వాల్.


అయితే రీసెంట్ గా కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయిందని.. షూటింగ్ కూడా వెళ్లబోతున్నానని అఫీషియల్ గా పోస్ట్ చేసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ ఈ సినిమా నుంచి తప్పించినట్లు కోలీవుడ్లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. దానికి కారణం కూడా ఉంది కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 సినిమాకి ముందే సైన్ చేసింది ఆ టైంలో అమ్ముడు చాలా హాట్ గా లుక్స్ వైస్ అభిమానులను మెప్పించే విధంగా ఉంది. కానీ ప్రజెంట్ కాజల్ అగర్వాల్ లుక్స్ పెద్దగా చెప్పుకునే విధంగా లేవు . డెలివరీ అయిన తరువాత కాజల్ తన బాడీని కరెక్ట్ షేపులో పెట్టడానికి ఇంకా శ్రమిస్తూనే ఉంది. కానీ అంత టైం ఇండియన్ 2 డైరెక్టర్స్ ఆమెకు ఇవ్వట్లేదు. ఈ క్రమంలోనే కాజల్ సినిమా నుంచి తప్పించి మరో యంగ్ బ్యూటీ హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్నారట. దీంతో కాజల్ సైన్ చేసిన సినిమా నుండి మళ్లీ తప్పుకోవాల్సి వచ్చింది అంటూ కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news