Moviesపాపం ముసలి హీరో అయినా కెరీర్ కోసం లిప్ లాక్‌కు ఒప్పుకుంది......

పాపం ముసలి హీరో అయినా కెరీర్ కోసం లిప్ లాక్‌కు ఒప్పుకుంది… సీన్ రివ‌ర్స్‌…!

మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరో వయసు కంటే హీరోయిన్స్ వయసు చాలా చిన్నదిగా ఉంటుంది. తండ్రి వయసు ఉన్న హీరోలు కూడా కుర్ర భామలతో రొమాన్స్ చేయాలని ఆశపడుతుంటారు. దీనికి ఉదాహరణ ఆర్తి అగర్వాల్. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి ముదురు హీరోల సరసన నటించింది. హీరోయిన్‌గా స్టార్ డం రావాలంటే తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంటున్నారు. అయితే, అలా నటించడం వల్ల కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడకుండా ఇబ్బందుల్లో పడ్డ హీరోయిన్స్ కూడా ఉన్నారు.

దీనికి ఉదాహరణ మజిలీ భామ దివ్యాన్ష కౌషిక్. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత, నాగ చైత్య జంటగా నటించారు. మొదటి అర్థ భాగం నాగ చైతన్య సరసన రొమాన్స్ చేసింది దివ్యాన్ష. తన పర్ఫార్మెన్స్‌తో బాగానే ఆకట్టుకుంది. అయితే, మజిలీ సినిమా తర్వాత అమళ్ళీ అమ్మడికీ అవకాశాలు దక్కలేదు. ఫొటో షూట్స్‌తో ఆకట్టుకోవాలని కొన్ని హాట్ ఫొటో షూట్స్ కూడా చేసి అవకాశాల కోసం తంటాలు పడింది. కానీ, వర్కౌట్ అవలేదు.

చివరికి మాస్ మహారాజ సరసన అవకాశం వచ్చింది. ఇంత సీనియర్ నటుడితో సినిమా అంటే ఫాంలో ఉన్న హీరోయిన్ గనక అయితే, అంత త్వరగా ఒప్పుకోదు. అది కూడా లిప్ లాక్ ఇవ్వాలి అంటే ససేమిరా అనే హీరోయిన్స్ ఉన్నారు. కానీ, దివ్యాన్షకి తప్పలేదు. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన రామారావు ఆన్‌డ్యూటీలో దివ్యాన్ష ఒక హీరోయిన్‌గా నటించిది. అయితే, ఈ సినిమాలో ఓ సాంగ్ ఉంటుంది. అందులో రవితేజ..దివ్యాన్ష పెదవులు అందుకుంటుంటాడు. ఇది కొంతమందికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

కానీ, కమర్షియల్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ కోసం ఇలాంటివన్నీ ఉండాలి. లేదంటే జనాలను థియేటర్స్ వరకు లాక్కురావడం కష్టం. దివ్యాన్ష కూడా ఒక సినిమాలో ఇచ్చేస్తే కనీసం అవకాశాలైనా వస్తాయని ఆశపడింది. తీరా చూస్తే, రవితేజ రామారావు డ్యూటీ సరిగ్గా చేయలేకపోయాడు. సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దాంతో దివ్యాన్ష కౌశిక్ కి ఇకపై ఛాన్సులొస్తాయే లేదో దేవుడికే తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news