Moviesజబర్ధస్త్ కమెడియన్లకు బిగ్ షాక్..కొంప ముంచేసిన మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్..!!

జబర్ధస్త్ కమెడియన్లకు బిగ్ షాక్..కొంప ముంచేసిన మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్..!!

యస్…జబర్ధస్త్ కమెడియన్లకు మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే విషయం నెట్టింట ట్రెండింగ్ గా మారింది. మనకు తెలిసిందే ఈ మధ్య కాలంలో..జబర్ధస్త్ స్టేజిని వదిలి అందరు వెళ్లిపోతున్నారు. కొందరు అవకాశాల కోసం..మరి కొందరు కాంట్రవర్షీయల్ క్రియేట్ చేయడం కోసం..ఎవ్వరు ఎలా వెళ్లినా జబర్ధస్త్ షో మాత్రం ఆపేదే లేదంటున్నారు మేనేజర్ ఏడుకొండలు. అంతేకాదు పోయిన వాళ్ళను ఎలా రప్పించుకోవడం కూడా ఈయనకి బాగా తెలుసు.

అయితే రీసెంట్ గా జబర్ధస్త్ నుండి యాంకర్ అనసూయ తప్పుకుంది. సినిమాలో అవకాశాలు ఎక్కువుగా వస్తున్న కారణం చేత..టైం కుదర్చలేక..జబర్ధస్త్ కు బై బై చెప్పేసింది. గ్రాండ్ సెండాఫ్ కూడా ఇచ్చింది జబర్ధస్త్ టీం. ఇంద్రజ గారు అయితే ఆమెను గట్టిగా పట్టుకుని ఏడ్చేసారు. ఈ షో నిన్ను మిస్ అవుతుంది అంటూ బాధపడ్డారు. అయితే, ఈ షో తదుపరి యాంకర్ ఎవ్వరు అని..బుర్ర గోకున్నారు అంతా. ఈసారి ఖచ్చితంగా మరో అద్దిరిపోయే ఫేస్ ను తీసుకొస్తారు అనుకున్నారు కమెడియన్లు.

సీన్ కట్ చేస్తే…మళ్ళీ యాంకర్ గా రష్మీనే సెలక్స్ట్ చేశారు మల్లెమాల వారు. ఎపిసోడ్ ప్రోమోలో యాంకర్ గా కొత్త అమ్మాయి వస్తున్నట్లు చూపించారు. పల్లకిలో వచ్చిన కొత్త యాంకర్ ని చూడడానికి, ఆమె ఎవరో తెలుసుకోవడానికి జబర్దస్త్ టీమ్ లీడర్స్ పోటీపడ్డట్లు చూపించారు. అబ్బో ఆమె ఎంట్రీకి ఇచ్చిన హంగామా చూసి..ఎవరో కొత్త అమ్మాయి అనుకుని సంబరపడ్డారు. తీరా చీర్ కొంగు జరిపి చూస్తే..రష్మి ముఖం కనిపించింది. దీంతో జబర్ధస్త్ కమెడియన్లు షాక్ అయ్యారు. మళ్లీ ఈ రష్మీనేనా అంటూ అందరు ముఖాలు వాడిపోయాయి. ఇక రష్మి…అయితే “నన్ను భరించండి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news