Moviesరష్మిక వద్దు అనుకున్న దాని పై ఆశపడుతున్న కృతిశెట్టి...బేబమ్మ రచ్చ మామూలుగా...

రష్మిక వద్దు అనుకున్న దాని పై ఆశపడుతున్న కృతిశెట్టి…బేబమ్మ రచ్చ మామూలుగా లేదుగా..!!

మన ఇండస్ట్రీలో ప్రస్తుతం కన్నడ బ్యూటీల హవా నడుస్తుంది. కేవలం వెండి తెర పైనే కాదు..బుల్లి తెర పై కూడా ఇదే హంగామా నడుస్తుంది. ఇప్పుడున్న ఆర్టిస్ట్లల్లో సగం మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు..కన్నడ పరిశ్రమకు చెందిన వారే. ఇండస్ట్రీ లో వాళ్ల డామినేషన్ ఎక్కువైపోతుంది. కాగా, ప్రజెంట్ ఇద్దరు కన్నడ బ్యూటి ల మధ్య హీట్ వార్ నడుస్తుంది. ఒక్కే ఇండస్ట్రీ నుండి వచ్చిన రష్మిక, కృతిశెట్టి.. తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటున్నారు.

రష్మిక అయితే పాన్ ఇండియా లెవల్ లో అవకాశాలు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తుంది . కృతి శెట్టి అయితే.. వరుస హ్యాట్రిక్ హిట్లతో..మంచి జోరు మీద ఉంది. ది వారియర్ సినిమా ఫ్లాప్ అయినా..అమ్మడి క్రేజ్ మాత్రం..సూపర్ గా ఉంది. దీంతో.. కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ..టాప్ ప్లేస్ లో ఉంది. ప్రజెంట్ అమ్మడు నటించిన మాచర్ల నియోజకవర్గం..రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో మరోసారి తన లక్ ను పరీక్షించుకోబోతుంది కృతిశెట్టి.

ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కు రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా ..రష్మిక మదన్నా ను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ, అమ్మడు బిజీ గా ఉండి కాల్ షీట్లు ఖాళ్లీ లేక ఈ సినిమా ను వదులుకుందట. కానీ, ఇండస్ట్రీ టాక్ ప్రకారం భీష్మ సినిమా టైంలో నితిన్ కు, రష్మికకు చెడ్డిందని..ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆ కారణం చేతనే..రష్మిక ఈ సినిమాను వదులుకుందట. దీంతో ఆ అవకాశాని బేబమ్మ అందుకుందని టాక్ వైరల్ గా మారింది. మరి చూడాలి ఈ సినిమాతో అయిన కృతిశెట్టి హిట్ అందుకుంటుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news