Moviesబాలీవుడ్ ని మరింత దిగజార్చిన అలియా ఘాటు కామెంట్స్..అంత మాట అనేసింది...

బాలీవుడ్ ని మరింత దిగజార్చిన అలియా ఘాటు కామెంట్స్..అంత మాట అనేసింది ఎంట్రా బాబు..!!

ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం నెపోటిజం. ఎస్ ఒక్క బాలీవుడ్ కాదు టాలీవుడ్ ఏ కాదు చాలా సినీ ఇండస్ట్రీలో ఈ నెపొటీజం ఎక్కువైపోతుంది అంటున్నారు జనాలు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన తరువాత ..ఈ నెపోటిజం పై ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన తర్వాతనే నెపొటిజం పై బాలీవుడ్ లో పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది.

కాగా రీసెంట్ గా నెపోటిజం కామెంట్స్ పై ఆలియా ఘాటుగా స్పందించింది. “స్టార్ కిడ్ గా పుట్టడం నా తప్పా.. నా నటన నచ్చకపోతే నన్ను చూడడం మానేయండి. అంతేకానీ, ఇలా నాపై నెపోటిజం కామెంట్స్ చేస్తే తట్టుకోలేను” అంటూ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం ఆలియా మాట్లాడిన మాటలు బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. కాగా గత కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి ఏంటో మనకు తెలిసిందే. ఒకప్పుడు కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్ ..ఇప్పుడు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా దారుణమైన కలెక్షన్స్ ని అందుకుంటుంది. దీంతో ప్రజెంట్ నార్త్ ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది.


బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తన భర్త రణబీర్ తో కలిసి నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లు భారీ బడ్జెట్ ని పెట్టారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలియా మాట్లాడుతూ ..”మీకు సినిమా నచ్చకపోతే చూడకండి. స్టార్ కిడ్ గా పుట్టడం నా తప్పుకాదు. నేనేం చేయలేను” అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు మేకర్స్ ను కష్టాల పాలు చేసేలా ఉంది. 500 కోట్లు పెట్టిన సినిమాకి ఆలియా అంత మాట అనడంపై బాలీవుడ్ కూడా గుర్రుగా ఉంది. దీంతో అలియా మాటలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news