Moviesబాల‌య్యకు జోడీగా నిధి అగ‌ర్వాల్‌.. వావ్ ఏం కాంబినేష‌న్‌...!

బాల‌య్యకు జోడీగా నిధి అగ‌ర్వాల్‌.. వావ్ ఏం కాంబినేష‌న్‌…!

ఎస్ ఇప్పుడు ఇదే విష‌యం టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. హాట్ అందాల భామ నిధి అగ‌ర్వాల్ బాల‌య్య‌కు జోడీ క‌ట్ట‌బోతోంద‌ట‌. నిధి అగ‌ర్వాల్ లాంటి కుంద‌న‌పు బొమ్మ‌.. బాల‌య్య క‌లిసి ఆన్‌స్క్రీన్ మీద క‌నిపిస్తే అస‌లు కిక్ ఎలా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. బాల‌య్య ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులే ఉండ‌వు. అఖండ సినిమాలోనే కుర్ర‌ది ప్ర‌గ్య జైశ్వాల్ బాల‌య్య క‌లిసి జై బాల‌య్యా సాంగ్‌కు డ్యాన్స్ వేస్తే స్క్రీన్ షేక్ అయిపోయింది. ఇప్పుడు నిధి అంటే పొడ‌గ‌రి.. నిధి – బాల‌య్య రేపు డ్యాన్స్ చేసినా స్క్రీన్ షేక్ అయిపోవ‌డం ఖాయం.

ఇక నిధి విష‌యానికి వ‌స్తే ఆమె అందాల నిధి. హైద‌రాబాద్‌లోని మార్వాడి కుటుంబంలో పుట్టిన ఆమె బాలీవుడ్‌లో మేఖేల్ మున్నా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత అక్కినేని అన్న‌ద‌మ్ములు నాగ‌చైత‌న్య‌తో స‌వ్య‌సాచి, అఖిల్‌తో మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలు చేసింది. రెండూ ప్లాప్ అయ్యాయి. ఈ టైంలో పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో రామ్ హీరోగా వ‌చ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో తొలి హిట్ కొట్టింది.

ఈ సినిమాలో నిధి అందాల ఆర‌బోత‌కు అడ్డే లేదు. ఇస్మార్ట్ శంక‌ర్‌తో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న నిధికి ఇప్పుడు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. గ‌ల్లా అశోక్ డెబ్యూ మూవీ హీరోలో న‌టించిన అమ్మ‌డు ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో న‌టిస్తోంది. అయితే ఈ హిస్టారిక‌ల్ మూవీ షూటింగ్‌కు గ‌త కొంత కాలంగా బ్రేక్ ప‌డింది.

ఇప్పుడు ఆమెకు ఏకంగా సీనియ‌ర్ హీరో బాల‌య్య‌తో జోడీ క‌ట్టే ఛాన్స్ వ‌చ్చేసింది. అనిల్ రావిపూడి – బాల‌య్య కాంబినేష‌న్లో ఓ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో బాల‌య్య కుమార్తెగా శ్రీలీల న‌టిస్తోంది. ఇక హీరోయిన్‌గా ముందు ప్రియ‌మ‌ణిని అనుకున్నారు. అయితే ప్రియ‌మ‌ణికి పెళ్ల‌వ్వ‌డంతో పాటు డేట్లు స‌ర్దుబాటు చేసే క్ర‌మంలో ఇబ్బందులు రావ‌డంతో ఇప్పుడు నిధి అగ‌ర్వాల్‌ను ఫిక్స్ చేశార‌ని టాక్ ?

ఇప్ప‌ట్లో హ‌రిహ‌ర వీర‌మల్లు సెట్స్ మీద‌కు వెళ్లే ఛాన్సులు లేవు. దీనికి తోడు బాల‌య్య సినిమా కోసం భారీ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డంతో నిధి ఓకే చేసేసింద‌ని అంటున్నారు. మ‌లినేని గోపీచంద్ జై బాల‌య్యా సినిమా పూర్త‌యిన వెంట‌నే ఆగ‌స్టు చివ‌ర్లో లేదా సెప్టెంబ‌ర్లో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఏదేమైనా బాల‌య్య – అనిల్ రావిపూడి లాంటి క్రేజీ కాంబోలో ఛాన్స్ అంటే నిధికి ల‌క్కీ ఛాన్సే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news