Moviesనయనతారతో కంపేరిజన్..చాలా కంపరంగా ఉంది..జాన్వీ సంచలన కామెంట్స్..!!

నయనతారతో కంపేరిజన్..చాలా కంపరంగా ఉంది..జాన్వీ సంచలన కామెంట్స్..!!

స్టార్ డాటర్ అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇన్నాళ్లు ఎప్పుడు హాట్ అందాలను ఆర బోస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచే ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా అభిమానుల పై ఫైర్ అవుతూ..కంపరంగా ఉంది అంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మనకు తెలిసిందే జానీ కపూర బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ..కెరీర్ లో సెటిల్ అవ్వడానికి చూస్తుంది.

పెద్ద గొప్ప మహానటి అని చెప్పలేం కానీ, పర్లేదు బాగా నటిస్తుంది అని మాత్రం చెప్పవచ్చు. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసి అలరించిన ఈ బ్యూటీ తాజాగా ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమాలో నటించింది. రిలీజ్ అయిన ట్రైలర్ ను చూసి జాన్వీ ని నటన పరం గా మెప్పించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, జాన్వీ నటనను చాలా మంది మెచ్చుకున్నారు. ఇంకొందరు అయితే,,. నయనతార తో కంపేర్ చేస్తూ..కామెంట్స్ చేశారు.

 

అంతే, జాన్వీకి కోపం వచ్చింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాని చెప్పుకొచ్చింది. ‘నయనతార లాంటి గొప్ప స్టార్‌ హీరోయిన్ తో నన్ను పోల్చడం చాలా హ్యాపీ . ఆమె దక్షిణాదిలో తిరుగులేని నటి. ఆమెతో పోల్చడం బాగానే ఉంది. కానీ నిజాయతీగా చెప్పాలంటే మీ ఈ కంపేరిజన్ నన్ను బాగా ఇబ్బంది పెడుతోంది. ఆమె నటించిన సినిమాను నాతో రీమేక్‌ చేశారు మేకర్స్ అంతే. దానికే ఇలా చేయడం..చాలా ఇబ్బందిగా ఉంది”..అంటూ చెప్పుకొచ్చింది. కాగా, నయన్ లీడ్ రోల్ పోషించిన తమిళ చిత్రం ‘కోలమావు కోకిల’ మూవీకు రీమేక్ నే జాన్వీ కపూర్ చేసిన సినిమా ‘గుడ్ లక్ జెర్రీ’.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news