Moviesనేను చూసిన బెస్ట్ డ్యాన్స‌ర్ ఎన్టీఆరే... ఆకాశానికి ఎత్తేసిన బాలీవుడ్ హీరో...!

నేను చూసిన బెస్ట్ డ్యాన్స‌ర్ ఎన్టీఆరే… ఆకాశానికి ఎత్తేసిన బాలీవుడ్ హీరో…!

ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లో టాలీవుడ్ బెస్ట్ డ్యాన్స‌ర్ ఎవ‌రు అంటే ముందుగా వినిపించే పేర్ల‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఉంటాడు. ఎన్టీఆర్‌తో పాటు బ‌న్నీ కూడా పోటాపోటీగా స్టెప్పులు వేసినా.. ఎన్టీఆర్‌కు చిన్న‌ప్ప‌టి నుంచే కూచిపూడి, భ‌ర‌త‌నాట్యంలో ప‌ట్టు ఉండ‌డంతో ఎలాంటి క‌ఠిన‌మైన స్టెప్పును అయినా చాలా సులువుగా వేసేస్తాడు. కొరియోగ్రాఫ‌ర్లు సైతం ఎన్టీఆర్ సాంగ్స్‌కు స్టెప్పులు కంపోజ్ చేసేట‌ప్పుడు చాలా క‌ఠిన‌మైన స్టెప్పులు ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు.

ఇక ఎన్టీఆర్ డ్యాన్స్‌, స్టెప్పులంటే ప‌డిచ‌చ్చే సినీ సెల‌బ్రిటీలు ఎంతోమంది ఉంటారు. నాటి త‌రం హీరోయిన్ల నుంచి నేటి త‌రం హీరోయిన్ల వ‌ర‌కు ఎంతో మంది త‌మ‌కు ఎన్టీఆర్ డ్యాన్స్‌, ఎన‌ర్జిటిక్ యాక్టింగ్ అంటే ఇష్ట‌మ‌ని చెపుతూ ఉంటారు. అస‌లు ఎన్టీఆర్ డ్యాన్స్‌ను ఆకాశానికెత్తేసిన యంగ్ హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు కూడా ఎంతో మంది ఉన్నారు.

 

అయితే ఎన్టీఆర్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యే బాలీవుడ్ స్టార్లు, సెల‌బ్రిటీలు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ డ్యాన్స్‌కు బాలీవుడ్ స్టార్ విద్యుత్ జమ్వాల్ కూడా ఫిదా అయిపోయాడు. దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ యాక్ష‌న్ హీరోల‌లో ఒక‌డిగా పేరున్న విద్యుత్ త‌న కొత్త సినిమా ఖుదా హఫీజ్ 2తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ నెల‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న విద్యుత్ హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నేష‌న‌ల్ లెవ‌ల్లో క్రియేట్ చేస్తున్న సంచ‌నాల గురించి మాట్లాడుతూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై క్రేజీ కామెంట్స్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెర‌ర్‌లో తాను చూసిన బెస్ట్ డ్యాన్స‌ర్ల‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ది బెస్ట్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

తాను ఇప్ప‌ట‌కీ ఎన్టీఆర్‌తో ట‌చ్‌లో ఉన్నాను అని.. ఆయ‌న టాలెంట్ అంటే త‌న‌కు ఎంతో ఇష్టం అని విద్యుత్ చెప్పాడు. ఇక తాజాగా త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వ‌రుస‌గా కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ సినిమాల్లో చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news