Moviesకేక పెట్టించే కాంబో : పవన్ పక్కన చరణ్ బ్యూటీ...రొమాన్స్...

కేక పెట్టించే కాంబో : పవన్ పక్కన చరణ్ బ్యూటీ…రొమాన్స్ వేరే లెవల్..?

సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్లు ఉన్నారు. రోజుకో కొత్త హీరోయిన్ తెర పై కి ఎంట్రీ ఇస్తుంది. అయినా కానీ, డైరెక్టర్, నిర్మాతలు కేవలం నాలుగు మంది హీరోయిన్ల చుట్టూనే తిరుగుతున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ మెగా హీరోలు కూడా ఆ నలుగురు హీరోయిన్స్ తోనే రొమాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. మెగా ఫ్యామిలీ లో ఉండే హీరోలంతా కూడా ఆ నలుగురు ముద్దుగుమ్మలనే మార్చి మార్చి హీరోయిన్లుగా తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు.

దీంతో మెగా ఫ్యాన్స్ కూడా జోడీ మారిస్తే బాగుండు అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ కి అద్దిరి పోయే హీరోయిన్ ని సెలక్ట్ చేసుకున్నారు. మనకు తెలిసిందే పవన్ కల్యాణ్ ఓ పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో బిజీ బిజీ గా ఉన్నాడు. కానీ ఆయనకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరిష్ శంకర్ తో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.


క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే..హారిష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను సెట్స్ పై పంపించనున్నాడు పవన్. అయితే, మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా అంటూ ప్రచారం జరింగింది. చాలా ఇంటర్వ్యుల్లో హారిష్ కూడా పరోక్షంగా దీని కన్ఫామ్ చేసారు. అయితే, రీసెంట్ గా పూజా ఆ సినిమా నుండి తప్పుకుంది అని..ఆ ప్లేస్ లోకి చరణ్ బ్యూటీ “కియారా అద్వానీ” వచ్చిన్నట్లు తెలుస్తుంది. యస్,,తాజా గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీనీ ఫైనల్ చేసిన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఈ కాంబో ఎలా పేరు తెచ్చుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news