Moviesపూజాహెగ్డే తలతిక్క పనులు..భారీ మూల్యం చెల్లించుకోకతప్పదా..?

పూజాహెగ్డే తలతిక్క పనులు..భారీ మూల్యం చెల్లించుకోకతప్పదా..?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే తన కెరీర్ ని తానే నాశనం చేసుకుంటుందా అంటే అవుననే అంటున్నారు జనాలు. పూజా హెగ్డే సినీ లైఫ్ గురించి మనకు తెలిసిందే..గతంలో ఒక్క సినిమా హిట్ కొట్టానికి ఎన్ని కష్టాలు పడిందో..అందరి చేత ఐరెన్ లెగ్ అని కూడా ముద్ర వేయించుకుంది. కానీ, లాస్ట్ కి ఆమె అనుకున్న స్దానానికి రీచ్ అయ్యి..ఎవ్వరైతే ఐరెన్ లెగ్ అన్నారో..వాళ్ల చేతనే..అదృష్ట దేవత అని పిలిపించుకుంటుంది. అలా నడుస్తుంది అమ్మడు టైం. ప్రస్తుతం ప్రతి స్టార్ హీరో కి పూజా నే కావాలి.

సినిమాలో హీరోయిన్ గా అయిన, స్టార్ హీరో కి చెల్లెలుగా అయినా, ఐటెం సాంగ్ లో చిందులు వెయ్యడానికి జిగేళ్ళు రాణీ గా అయినా..అందరికి ఈ బుట్టబొమ్మ నే కావాలి. అలాంటి రేంజ్ సంపాదించుకుంది..ఈ అమ్మడు. పూజా అదృష్టం ఎలా ఉందంటే..వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లు పడ్డా కానీ, అమ్మడు రేంజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. అంతలా అభిమానులను, హీరోలని, డైరెక్టర్లను మాయ చేసింది పూజా. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఐదు ప్రాజెక్ట్లు ఉన్నాయి. దానిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్” కూడా ఉంది.

అయితే, పవన్ రాజకీయాలల్లో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుండటంతో..ఆ సినిమాకి కేటాయించిన కాల్ షీట్లను..వేరే సినిమాకి వాడుకునేస్తూ… పవన్ సినిమా నుండి తప్పుకుంది పూజా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆమె పై ఫైర్ అవుతున్నారు. పవన్ తో నటించాలంటే అదృష్టం ఉండాలని,,అది ఆమెకు లేదని..చెప్పుకొస్తున్నారు. కాగా, తాజా గా పూజా ..విజయ్ కోసమే పవన్ సినిమా నుండి తప్పుకుంది అంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

పూరి జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన లో పూజా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే అమ్మడు పవన్ సినిమా నుండి తప్పుకుందంటు ఓ వార్త వైరల్ అవుతుంది. దీంతో అమ్మడు పై ట్రోలింగ్ స్టార్ట్ చేసారు ట్రోలర్స్..పవన్ లాంటి బిగ్ హీరో సినిమాను రిజెక్ట్ చేశావ్..ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ మండిపడుతున్నారు పవన్ అభిమానులు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news