Moviesబిడ్డ పుట్టిన తరువాత కాజల్ ఫస్ట్ సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇదే..ఎంత...

బిడ్డ పుట్టిన తరువాత కాజల్ ఫస్ట్ సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇదే..ఎంత స్పెషల్ అంటే..?

కాజల్ అగర్వాల్..లక్ష్మి కల్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దశాబ్ధ కాలంగా కాజల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. కెరియర్ కాస్త వెనుకపడినట్టు అనిపించిన ప్రతిసారి మళ్లీ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది కాజల్. మొదటి సినిమాతోనే మంచి విజయాని తన ఖాతాలో వేసుకుంది.

ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజిగా మారిపోయింది. రామ్ చరణ్ తో కాజల్ నటించిన చిత్రం..మగధీర ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత 16 ఏళ్లు గా కథానాయికగా రాణిస్తోంది కాజల్. కాజల్. రెండు తరాల హీరోలతో ఒకేసారి నటించి వారి తో రొమాన్స్ చేసే హీరోయిన్ కాజల్ రికార్డులకెక్కింది. రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈమె చిరంజీవితో కూడా కలిసి నటించింది. అయితే, తాను ఇష్టపడిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న కాజల్.. పెళ్లి తరువాత కూడా బిజీ గా సినిమాలు చేసిన కాజల్..ప్రెగ్నెంట్ అయ్యాక మొత్తం టైం ఇంట్లోనే గదిపింది.

ఈ మధ్యనే.. కాజల్ కి ఓ బాబు పుట్టాడు. అయితే, ఇన్నాళ్లు సినిమా ఇందస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్..ఇప్పుడు సినిమాలోకి మల్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆమె కొన్ని కధలు వినగా..దానిలో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో అక్క రోల్ ని ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది. నిజానికి ఇది సిస్టర్ సెంటి మెంట్ స్టోరి అని కాజల్ ఒప్పుకున్నిందట. ఈ సినిమాలో ఆమె ఓ బిడ్డ కు తల్లిగా కూడా కనిపించబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. వేరే సినిమా అయితే ఖచ్చితంగా నో చెప్పేసేది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై సీన్ చేసిన అమ్మడు..తన రీ ఎంట్రీ పై బోలెడు ఆశలు పెట్టుకుంది కాజల్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news