Moviesతారక్‌ మాటలతో కోమాలో ఉన్న అభిమాని రెస్పాండ్ .. శభాష్ NTR..!!

తారక్‌ మాటలతో కోమాలో ఉన్న అభిమాని రెస్పాండ్ .. శభాష్ NTR..!!

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా కానీ… నందమూరి నట వారసుడు NTR రేంజ్, క్రేజ్, ఫాలోయింగ్ అన్నీ వేరే లెవల్ లో ఉంటాయి. తారక్ ని అంభిమానులు హీరోగా కాకుండా..తమ పెద్దన్నాల చూస్తుంటారు. అలానే భావిస్తుంటారు. తారక్ పుట్టిన రోజు అయితే..తమ ఇంట్లోని వ్యక్తి పుట్టిన రోజులా..చాలా గ్రాండ్ గా కేక్ కట్టింగ్ పార్టీలు..అరుపులు కేకలతో సందడి చేస్తుంటారు.

ఇక తారక్ కూడా అంతే..ఫ్యాన్స్ అంటే ప్రాణం. తారక్ వచ్చిన ప్రతి ఆడియో ఫంక్షన్లల్లో ..ఈవెంట్స్ కి..వచ్చిన ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు ..”మీరు ఇక్కడకి ఎంత జాగ్రత్తగా వచ్చారో అంతే కేర్ ఫుల్ గా ఇంటికి జాగ్రత్తగా వెళ్లండి. మీకోసం అమ్మనాన్నలు ఎదురుచూస్తుంటారు”..అంటూ ఇంటికి పెద్ద దిక్కులా అభిమానులకు చెప్పుకొస్తుంటారు. అందుకే అభిమానులకు NTR అంటే మరింత ఇష్టం.

అయితే, తాజాగా తారక్ చేసిన పనికి సినీ ప్రముఖులు సైతం శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. అభిమానుల కోసం ఏమైనా చేసే తారక్ ..తాజాగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన అభిమానితో మాట్లాడి ధైర్యం చెప్పారు. జనార్థన్‌ అనే అభిమాని అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యాన్ని నింపాడు తారక్. అంతేకాదు వారి అమ్మతోనూ మాట్లాడి “నేనున్నాను..మీ అబ్బాయికి ఏం కాదు. అంత మంచిగా జరిగుతుంది..”అంటూ ఆమెకి భరోసాన్నిచ్చారు. తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నారు Jr NTR. తారక్‌ మాట్లాడుతుంటే కోమాలో ఉన్న జనార్ధన్‌ వేళ్లు కదిలిస్తున్నాడని అక్కడున్నవాళ్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news