Moviesజబర్ధస్త్ నుండి అనసూయ తప్పుకొవడానికి రీజన్ ఆమె జాన్ జిగిడి డైరెక్టర్...

జబర్ధస్త్ నుండి అనసూయ తప్పుకొవడానికి రీజన్ ఆమె జాన్ జిగిడి డైరెక్టర్ దోస్తా..?

యస్..తాజాగా అనసూయ పెట్టిన్ అపోస్ట్ ఆధారంగా చూసుకుంటే ఈ వార్తనే నిజం అనిపిస్తుంది. తన అందచందాలతో కుర్రాళ్ళ ను కట్టిపడేస్తున్న అనసూయ..జబర్ధస్త్ ద్వారానే గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో ద్వారానే ఆమె యాంకర్ గా పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీ అందం చూసే..సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు డైరెక్టర్స్.

 

బుల్లి తెర పై ఏ రేంజ్ లో అందాలు ఆరబోసిందో..వెండితెర పై కూడా..అలానే హాట్ అందాలతో రెచ్చకొడుతూ ..కొన్ని సార్లు నటన పరంగా శభాష్ అనిపించుకుంటూ..అటు బుల్లితెర..ఇటు వెండి తెర రెండింటిని తన దైన స్టైల్ లో మ్యానేజ్ వస్తుంది. మనకు తెలిసిందే..ఇప్పుడు అనసూయకు ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో స్టార్ డమ్ వచ్చింది.

వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పుడు అమ్మడి చేతిలో నాలుగు అఫీషీయల్ సినిమాలు ఉన్నాయి. కాగా, మరి కొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతుంది. ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతున్న అనసూయా.. తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేస్తూ..”నాకు తెలుసు ఇది నా కెరీర్‌లో చాలా పెద్ద నిర్ణయం అని..కానీ ఇలా చేయక తప్పట్లేదు. ఎన్నో స్వీట్ మెమోరీస్‌ను నా వెంట తీసుకెళ్తున్నాను.. ఎన్నో మంచి మధురక్షణాలతో పాటు.. కొన్ని చేదు క్షణాలుకూడా ఉన్నాయి.మున్ముందు నాకు ఎదురయ్యే వాటి కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను.. మీరంతా ఎప్పుడూ నాతోనే ఉంటారని ఆశిస్తున్నాను’ అని అనసూయ చెప్పుకొచ్చింది.

కాగా, ఇలా అనసూయ సినిమాల నుండి తప్పుకోవడానికి కారణం తాన జాన్ జిగిడి డైరెక్టర్ ఫ్రెండ్ అంటూ వార్తలు వస్తున్నాయి. “నీకు ఇప్పిఉడు ఫుల్ క్రేజ్ ఉంది ఆఫర్లు వస్తున్నాయి..ఇలా యాంకరింగ్ చేస్తూ ఉంటే ఆ పాపులారిటీ డౌన్ అవుతుంది.. కెరీర్ పై కాన్ సెన్ట్రేషన్ చెయ్యి”అంటూ పరీక్షంగా జబర్ధస్త్ పై హింట్ ఇచ్చాడట. ఈ క్రమంలోనే అనసూయ ఇలాంటి కఠిన డెసీషన్ తీసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news