Moviesజాక్ పాట్ కొట్టిన కీర్తి సురేష్..ఏకంగా పాన్ ఇండియా హీరో తో...

జాక్ పాట్ కొట్టిన కీర్తి సురేష్..ఏకంగా పాన్ ఇండియా హీరో తో నటించే ఛాన్స్..?

రీసెంట్ గా మహేశ్ బాబు సినిమా సర్కారు వారి పాట తో..బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న అందాల కుందనపు బొమ్మ కీర్తి సురేష్..ప్రజెంట్ మంచి ఫుల్ ఫాంలో ఉంది. మహానటి సినిమా తరువాత ఒక్క హిట్ అందుకోలేకపోయిన కీర్తి కి..సర్కారు వారి పాటే సక్సెస్ ఇచ్చింది. నిజానికి ఈ సినిమా లో కీర్తి డిఫరెంట్ లుక్స్ లో కనిపించింది. ఎప్పుడు లిమిట్స్ క్రాస్ చెయ్యని కీర్తి ఈ సినిమాలో మహేశ్ కోసం ..హద్దులు చెరిపేసింది. నాభి అందాలతో మాస్ డ్యాన్స్ ఇరగదీసింది.

కీర్తి లో మాస్ యాంగిల్ ఉందని,, ఈ సినిమాలో మ మ మహేశా సాంగ్ చేసే వరకు అభిమానులకు కూడా తెలియదు. సినిమాలో కి వచ్చే ముందు తనకు తాను కొన్ని రూల్స్ పెట్టుకున్న కీర్తి సురేష్..పెరుగుతున్న కాంపిటీషన్ కి..కుర్ర బ్యూటీల అందలా ముందు తట్టుకోవడానికి..ఇండస్ట్రీలో నిలబడటానికి..తాను పెట్టుకున్న లిమిట్స్ క్రాస్ చేసింది. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే, ఈ సినిమా సక్సెస్ పుణ్యమా అని కీర్తి పాన్ ఇండియా సినిమాలో అంటించే ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ నటిస్తున్న RC15 సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్లు గా అంజలి, కియారా అద్వాని నటిస్తున్నారు. కానీ, సినిమా ఓ జర్నలిస్ట్ పాత్ర ఉందని..అది చాలా కీలక మైన రోల్ అని..అది క్రేజ్ ఉన్న హీరోయిన్ చేస్తేనే బాగుంటుందని రష్మిక ను అప్రోచ్ అయ్యారట టీం..కానీ ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువ అడగటంతో..ఇప్పుడు ఈ ఆఫర్ కీర్తి కి వచ్చిన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి నటనకి స్కోప్ ఉన్న పాత్రలని కీర్తి వదులుకోదు..పైగా రామ్ చరణ్ సినిమా కావడంతో సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చేసేసిందట. దీంతో అమ్మడు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news