MoviesNBK 107 టీజర్: "భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే"...

NBK 107 టీజర్: “భయం నా బయోడేటా లోనే లేదురా బోసడికే” ..ఊర మాస్ డైలాగ్స్ తో కేకపెట్టించిన బాలయ్య..!!

వచ్చేసింది…కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూసిన బాలయ్య బర్త డే టీట్ ఇచ్చేశాడు డైరెక్టర్ గోఫీచంద్ మల్లినేని. రేపు నందమూరి నట సింహం బాలయ్య పుట్టిన రోజు..అంటే అభిమానులకు ఓ పెద్ద పండగ రోజు. దీంతో బాలయ్య బర్తడే కానుకగా..ఆయన నెక్స్ట్ సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. మనకు తెలిసిందే బాలయ్య..గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా తీస్తున్నాడని.

తాజాగా ఆ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. వావ్.. బాలయ్య నోట ఊర మాస్ డైలాగ్స్ వింటుంటే..గూస్ బంప్స్ వస్తున్నాయి. లుక్స్ తోనే సినిమా పై హైప్ పెంచేసిన బాలయ్య..ఇప్పుడు తాజా గా టీజర్ తో సినిమా పై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకునేలా చేశారు. ఈ మూవీ అఖండ ని తలపిస్తుంది. నల్ల చొక్కా, బూడిద రంగు లుంగీ ధరించిన బాలయ్యను ఓ ఊరికి పెద్దగా పరిచయం చేశారు టీజర్ లో బాలయ్య..చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు నెట్టింట టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా..బాలయ్య చెప్పిన..”మీ G O గవర్న మెంట్ ఆర్డర్..నా G O గాడ్స్ ఆర్డర్”..అంటూ చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇక బాలయ్య..స్టైల్ గా చుట్ట నోట్లో వేసుకునే గ్లింప్స్ బాలయ్య ఈ సినిమా మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని చెప్పకనే చెప్పేసింది. అంతేకాదు ఇంకా బాలయ్య చెప్పిన ..”భయం నా బయోడేటా లోనే లేదురా బోస డి కె” అనే డైలాగ్..

ఇంకా..”నరకం మొదలు పెడితే..ఏ పార్ట్ ఎవ్వరిదో మీ పెళ్లాలు కూడా గుర్తుపట్టలేరు..” అంటూ చెప్పే మాస్ డైలాగ్స్ బాగా హైలెట్ అయ్యాయి. సినిమా కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్లస్ కానుందని టీజర్ బట్టే అర్ధమైపోతుంది. ఓవర్ ఆల్ గా అభిమానులకు నాన్ వెజ్ మీల్స్ రెడీ చేశాడు బాలయ్య ఈ సినిమా తో అని అర్ధమైపోయింది. ఈ సినిమా తో బాలయ్య ఖాతాలో మరో హిట్ పక్కా..జై బాలయ్య అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news