Movies"చీప్‌గా వాగొద్దు".. ఫస్ట్ టైం బండ్లకు పూరీ స్ట్రైట్ వార్నింగ్..!!

“చీప్‌గా వాగొద్దు”.. ఫస్ట్ టైం బండ్లకు పూరీ స్ట్రైట్ వార్నింగ్..!!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో..సినీ ఇండస్ట్రీలో కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్ పేరు మారుమ్రోగిపోతుంది. తన స్పీచ్ లతో ఎప్పుడు హాట్ టాపిక్ గా మీడియా లో కనిపించే ఈయన ఈసారి..కాంట్రవర్షీయల్ స్పీచ్ తో జనాల చేత తిట్టించుకుంటున్నారు. మనకు తెలిసిందే బండ్లన్నకు మైక్ ఇస్తే..ఒళ్ళు తెలియదు..పూనకం వచ్చిన్నట్లు ఊగిపోతూ మాట్లాడేస్తుంటారు. ఇలా చాలా ఈవెంట్స్ లో జనాలకు పూనకాలు తెప్పించాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్ అంటే బండ్లన్న స్పీచ్ కంపల్సరీ అన్నట్లు అయిపోయింది పరిస్ధితి.

ఇక రీసెంట్ గా బండ్ల గణేష్..పూరీ జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటించిన చోర్ బజార్..అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చి..పూరీనే నిలదీశాడు. “నువ్వు కొడుకుని పట్టించుకోవడం లేదని.. ఎందరినో స్టార్లను చేసిన నువ్వు..నీ కొడుకు ఫంక్షన్ కి రాకుండా ఏం చేస్తున్నావ్ అని.. వదినా బంగారం..పిల్లలిని బాగా చూసుకో.. వాళ్ళకంటే..మనకు ఎవ్వరు ముఖ్యం కాదు”..అంటూ కూసింత పరసనల్ గా వెళ్లి..టూ మచ్ సలహాలు ఇచ్చాడు. దీంతో బండ్ల గణేష్ మాటలు టూ హాట్ గా మారాయి.

అయితే, బండ్ల మాటల పై పూరీ అప్పుడు పెద్ద గా సీరియస్ గా తీసుకోలేదు కానీ, రీసెంట్ గా పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా యూట్యూబ్ షార్ట్స్‌లో ఓ ఆడియోను షేర్ చేశాడు . అందులో పూరీ చెప్పిన మాటలు వింటే ఎవ్వరికైన అర్ధమైపోతాది అది బండ్ల గణేష్ గురించే అని. పూరీ మాట్లాడుతూ..” అందరు ఓ విషయ, గుర్తు పెట్టుకోండి.. మన నాలుకు కదులుతున్నంత సేపు జీవితంలో మనం ఏమీ నేర్చుకోలేము.

అందుకే చాలా మంది పెద్దవాళ్ళు చెప్పుతుంటారు..జీవితంలో ఎక్కువ సేపు మనం వింటూ ఉండాలి అని.. అదే ప్రస్తుత సమాజానికి చాలా మంచిది. అది ఎవ్వరైన సరే ఫ్యామిలీ మెంబర్స్ కావొచ్చు.. మీ ఫ్రెండ్స్ కావొచ్చు.. ఆకరికి నువ్వు కట్టుకున్న భార్య/భర్త దగ్గర కూడా ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి.. చీప్‌గా నోటికి వచ్చిన్నట్లు వాగొద్దు..ప్రవర్తించొద్దు. మీరు మాట్లాడే ప్రతి మాట మీ కెరీర్‌ను, క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుంది. నీ లైఫ్, నీ డెత్.. నీ టంగ్ మీద ఆధారపడి ఉంటుంది’.. అని యూట్యూబ్ షార్ట్స్‌లో పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఈ మాటలు బండ్లకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి పూరి పోస్ట్ చేసారంటూ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news