Moviesప్రభాస్ కోసం పోటీపడుతున్న ఇద్దరు హాట్ బ్యూటీస్.. డైరెక్టర్ కు పెద్ద...

ప్రభాస్ కోసం పోటీపడుతున్న ఇద్దరు హాట్ బ్యూటీస్.. డైరెక్టర్ కు పెద్ద తలనొప్పే..?

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఆయన రీసెంట్ రాధే శ్యామ్ తో కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్ సినిమా ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా కానీ ఆయన తో సినిమాలు చేయడానికి డైరెక్టర్స్ ఉత్సాహంగా ఉన్నారు. నార్త్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాందించుకున్నా ప్రభాస్‏తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. ఇక డార్లింగ్ చేస్తోన్న సినిమాల ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రజెంట్ సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ లల్లో బిజీ గా ఉన్నా ఈ హీరో.. స్పిరిట్ సినిమాకు కూడా ఓకే చెప్పిన విషయం తెలిసిందే. “అర్జున్ రెడ్డి” సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా ను డైరెక్ట్ చేస్తున్నాడు . సందీప్ ప్రస్తుతం ‘యానిమల్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ‘యానిమల్’ తర్వాత సందీప్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు అభిమానులు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం.. ఇద్దరు కథానాయికలు పోటీపడుతున్నారని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం బోలెడు మంది హీరోయిన్స్ ను అనుకోగా,,లాస్ట్ కి వాళ్ళల్లో ఇద్దరిని హోల్డ్ లో పెట్టిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్లల్లో ఒకరు కన్నడ బ్యూటీ రష్మిక మందన, మరోకరు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీలను డైరెక్టర్ లైన్‌లో పెట్టిన్నట్లు తెలుస్తుంది.

ఈ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రభాస్ కు జోడీగా కియారా అద్వానీ అయితే బాగుంటుందని కొందరు భావిస్తూ ఉంటే.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పుష్ప తో మంచి పేరు దక్కించుకున్న రష్మిక మందన్నా అయితే స్పిరిట్ సినిమాకు కలిసి వస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చిత్ర యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news