Moviesవాట్..ఆ హీరోకి చెల్లెలుగా పూజా హెగ్డే..డైరెక్టర్ మైండ్ దొబ్బిందా..?

వాట్..ఆ హీరోకి చెల్లెలుగా పూజా హెగ్డే..డైరెక్టర్ మైండ్ దొబ్బిందా..?

సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ హీరో గా వెంకటేష్ చేసిన సినిమాలు ఇప్పటికి చిరస్దాయిగా నిలిచిపోయాయి. ప్రజెంట్ ఆయన ఫాలోయింగ్ తగ్గిందే కానీ..ఆయనలోని గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. చాలా కాలం తరువాత ఇప్పుడిప్పుడే మళ్లీ ఫాంలోకి వస్తున్న హీరో వెంకటేష్ మరికొద్ది రోజుల్లో ఎఫ్ 3 సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆయన నటించిన ఎఫ్ 2 సినిమా కి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ తో దుమ్మురేపుతూనే..మరోవైపు అగ్ర హీరోలు కూడా తిరిగి బీటౌన్ పయనమవుతున్నారు. ఇప్పటికే చిరు సైరాతో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు. నాగార్జున బ్రహ్మాస్త్రాలో నటిస్తున్నాడు. ఇప్పుడు వెంకీ వంతు వచ్చింది. ఏకంగా సల్మాన్ ఖాన్ తో కలసి మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు విక్టరీ. ఆమధ్య చిరంజీవి సినిమాలో సల్మాన ఖాన్ నటించగా.. ఇప్పుడు సల్మాన్ సినిమాలో వెంకటేష్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం చాలా ఏళ్ల తరువాత మళ్లీ వెంకటేష్ హిందీలో ఒక స్టార్ హీరో సినిమాలో ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ “కభి ఈద్ కభి దివాళి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫర్హద్ సంజి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ ఏడాది ఆఖరులో విడుదల కాబోతోంది.

తన కొత్త సినిమా “కబీ ఈద్ కబీ దివాలి” లో ఒక కీలకమైన పాత్రలో వెంకటేష్ నీ చేయాలని సల్మాన్ కోరినట్లు దానికి వెంకీ ఓకే చెప్పినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ సినిమాలో పూజా హెగ్డే కూదా నటిస్తుందట. వెంక‌టేశ్ పూజాహెగ్డే కు సోద‌రుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు తిట్టిపోస్తున్నారు..నీ మైండ్ దొబ్బిందా అంటూ ప్రస్నిస్తున్నారు. ప్ర‌స్తుతం వెంకీ చేస్తున్న తెలుగు సినిమా ఎఫ్ 3లో ఐటెం సాంగ్ చేస్తోంది పూజాహెగ్డే. ఇక ఇపుడు ఈ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్ అండ్ సిస్ట‌ర్‌గా బాలీవుడ్ మూవీలో కనిపించబోతున్నారనే వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news