Moviesమహేశ్‌ తో నటిస్తే.. అలాంటి ఇమేజ్‌ పక్కా..!!

మహేశ్‌ తో నటిస్తే.. అలాంటి ఇమేజ్‌ పక్కా..!!

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నటనకి నటన అందానికి అందం ఆయన సొంతం. అటు క్లాస్ ఆడియన్స్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని మెప్పించగల సత్తా ఉన్న హీరో. రాజకుమారుడు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరో గా వచ్చినప్పుడు ఆయన ఎంత అందంగా ఉన్నారో.. నిన్న రిలీజ్ అయిన సర్కారు వారి పాట సినిమాలో కూడా అంతే అందంగా ఉన్నారు. తన క్యూట్ హ్యాండ్ సమ్ లుక్స్ తో అమ్మాయిల మనసు దోచేస్తున్న రాజకుమారుడు ఈ మహేశ్. ఇంత అందగాడి తో నటించాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆ అవకాశం అందరికి ఇవ్వడు మహేశ్.

తను చూస్ చేసుకునే సినిమా ల కధ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో.. సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో కూడా అంతే కరెక్ట్ గా ఉంటాడు. మహేశ్ తో నటిస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని స్వయాన ఆయనతో పని చేసిన హీరోయిన్స్ నే చెప్పుకొస్తారు. అయితే మహేశ్ సినిమాలో నటిస్తే ఆ హీరోయిన్స్ మాస్ ఇమేజ్ రావడం పక్క అని మరోసారి ప్రూవ్ అయ్యింది.

 

రీసెంట్ గా రిలీజ్ అయిన సర్కారు వారు పాట సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ఎంత క్లాస్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు అమ్మడు మాస్ జోలికే పోలేదు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మహేశ్ కోసం సినిమా”మ మ మహేశా” ఫుల్ మాస్ బీట్ స్టెప్స్ తో రెచ్చిపోయింది. ఆమె డ్యాన్స్ చూసిన జనాలకు కూడా తెగ ఊపేస్తున్నారు. అంత మాస్ ఇమేజ్ సొంతం చేసుకుంది.

ఇక అంతకముందు సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక ఫుల్ సైలెంట్, డీసెంట్ లుక్స్ తో అట్రాక్ట్ చేసింది. ఈమె కూడా మాస్ నాటు స్టెప్పుల జోలికి అస్సలు పోలేదు. కానీ ఫస్ట్ టైం మహేశ్ కోసం ఆ జోనర్ టచ్ చేసి..”మైండ్ బ్లాక్ మైడ్ బ్లాక్ ..బాబు నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్”అంటూ ఇరగదీసింది. అలా మహేశ్ చెయ్యి పడిన ప్రతి హీరోయిన్ మాస్ ఇమేజ్ సొంతం చేసుకుంటుంది. మరీ నెక్స్ట్ ఆ అందాల దేవత ఎవరో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news