Lifestyleఈ అల‌వాట్లే ల‌వ్ బ్రేక‌ప్‌కు కార‌ణ‌మ‌వుతాయి... జ‌ర జాగ్ర‌త్త‌...!

ఈ అల‌వాట్లే ల‌వ్ బ్రేక‌ప్‌కు కార‌ణ‌మ‌వుతాయి… జ‌ర జాగ్ర‌త్త‌…!

ప్రేమ అనేది ఓ అంద‌మైన అనుభూతి… మ‌న‌స్సుకు ఇది ఎంతో ఉత్సాహం, ఉల్లాసం క‌లుగ‌జేస్తుంది. ప్రేమ అనేది పుట్ట‌డానికి ఎంత స‌మ‌యం తీసుకుంటుందో ? బ్రేక‌ప్ కావ‌డానికి అంతే త‌క్కువ స‌మ‌యం ప‌డుతుంది. ప్రేమ పుట్ట‌డం చాలా సుల‌భం… కానీ క్ష‌ణ‌కాలంలో వాళ్ల మధ్య చిచ్చురేగి విడిపోతూ ఉంటారు. అయితే బ్రేక‌ప్‌కు చాలా కార‌ణాలే ఉంటాయి. ప్ర‌పంచంలో 90 శాతం మంది త‌మ జీవితంలో ఏదో ఒక స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డ‌తారు. ప్రేమ అనేది ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఉన్న న‌మ్మ‌కం.

ఈ న‌మ్మ‌కం అనేది ఎంతో జాగ్ర‌త్త‌గా.. అపురూంగా చూసుకోవాలి. అప్పుడే ప్రేమ అనేది నిల‌బ‌డుతుంది. ఎదుటి వారిపై చెప్ప‌లేనంత ప్రేమ ఉన్న‌ప్పుడు వారి త‌ప్పుల‌ను కూడా స్వీక‌రించే గుణం ఉండాలి. అయితే ఈ రోజుల్లో బంధాలు అనేవి ఎక్కువ కాలం నిల‌బ‌డ‌డం లేదు. చైతు – స‌మంత ప్రేమించుకున్న‌ప్పుడు వాళ్లు ఎంత అపురూపంగా ప్రేమించుకున్నారో… వారు ప్రేమ‌ను ఎంత ఎంజాయ్ చేశారో.. వారి ప్రేమ‌ను చూసిన జ‌నాలు కూడా అంతే అస్వాదించారు.

అలాంటి జంటే అంద‌రికి షాక్ ఇస్తూ నాలుగేళ్ల‌కే త‌మ పెళ్లి బంధం పెటాకులు తీసుకున్నారు. ఇటీవ‌ల కాలంలో బ్రేక‌ప్‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం ఏంటన్న ప్ర‌శ్న‌కు చెడు అల‌వాట్లే ఎక్కువ కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. ఈ అల‌వాట్లు పెరుగుతున్నాయంటే మ‌న ప్రేమ బ‌ల‌హీన‌ప‌డ‌డం మొద‌లు అయిన‌ట్టే..! మ‌రి ప్రేమ బంధాన్ని బ‌ల‌హీనం చేసే ఆ అల‌వాట్లు ఏంటో తెలుసుకుందాం.

ప్రేమ‌బంధంలో భాగ‌స్వామిని చీటికిమాటికి అనుమానించ‌డం.. కంట్రోల్లో పెట్టాల‌ని చూడ‌డం చేయ‌కూడ‌దు. అలాగే ఇద్ద‌రూ క‌లిసి నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఎంతో ముఖ్యం. అంతేకాని భాగ‌స్వామిని మ‌న చెప్పుచేత‌ల్లో ఉంచుకుంటూ కంట్రోల్ చేయాల‌ని అనుకోవ‌డం.. మ‌నం చెప్పిన‌ట్టే చేయాలి.. వినాలి అనే కండీష‌న్లు పెట్ట‌డం లాంటి నిబంధ‌న‌లు పెట్ట‌కూడ‌దు. కొంద‌రు అయితే ఏకంగా భాగ‌స్వామి ఏ దుస్తులు వేసుకోవాలి ? ఏవి వేసుకోకూడ‌దు ? ఎవ‌రితో ఎంత స‌మ‌యం గ‌డ‌పాలి ? బ‌య‌ట‌కు ఎప్పుడు వెళ్లాల‌న్న కండీష‌న్లు కూడా పెడుతూ ఉంటారు.. ఇది కాస్తా అస‌హ‌నానికి కార‌ణ‌మై అనూహ్యంగా బ్రేక‌ప్‌న‌కు దారితీస్తుంది.

రిలేష‌న్ షిఫ్ అన్నాక ఒక‌రిపై ఆధార‌ప‌డ‌డం వ‌ర‌కు త‌ప్పులేదు. మీరు ఏ ప‌ని చేయ‌కుండా వాళ్ల‌మీదే ఆధార‌ప‌డితే చుల‌క‌న అవుతాం.. వారు లేకుండా మీరు బ‌త‌క‌లేరు అన్న ఆలోచ‌న వాళ్ల‌కు వ‌చ్చేస్తుంది. వాళ్లు ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే మీకు గుర్తు చేయ‌డం.. దీంతో మీరు ప్ర‌ష్టేష‌న్‌లోకి వెళ్లి చివ‌ర‌కు అది బ్రేక‌ప్‌న‌కు దారితీస్తుంది. ఇక భాగ‌స్వామిపై నిఘా ఉంచ‌డం వ‌ర‌కు కొంత ఓకే.. అయితే వారు సోష‌ల్ మీడియాలో ఏం చేస్తున్నారు ? ఏం చూస్తున్నారు ? ఎవ‌రితో ఎంత‌సేపు మాట్లాడుతున్నారు.. వారి మెసేజ్‌లు ఏంట‌న్న దానిపై ప‌దే ప‌దే నిఘాపెట్టినా.. వారిని ప్ర‌శ్నించినా అది మొద‌టికే మోసం వ‌స్తుంది.

వీటితో పాటు హింస‌, శారీర‌కంగా, మాన‌సికంగా పెట్టే ఏ ఇబ్బందులు అయినా కూడా ఆ బంధాన్ని సులువుగా నాశ‌నం చేస్తాయి. భాగ‌స్వామిని ఎప్పుడూ కూడా మాన‌సికంగా హింసించ‌డం లేదా శారీర‌కంగా బాధ‌పెట్ట‌డం చేస్తే మీ బంధం చాలా త్వ‌ర‌గా ముగిసిన‌ట్టే అవుతుంది. మ‌రికొంద‌రు అయితే చిన్న చిన్న విష‌యాల‌కు కూడా విడిపోతూ ఉంటారు. చివ‌ర‌కు కూర‌లో కారం త‌క్కువైంద‌ని.. చికెన్ కూర వండ‌లేద‌ని విడిపోయిన దంప‌తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక భాగ‌స్వామ్యంలో క‌నీసం ఇద్ద‌రిలో ఒక‌రు త‌గ్గాల్సిన టైం వ‌చ్చిన‌ప్పుడు త‌గ్గినా కూడా చాలా బంధాలు బ‌ల‌హీన‌ప‌డ‌వు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news