Moviesరామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ సినిమాకు ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌... ప‌వ‌ర్ ఫుల్...

రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాకు ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌… ప‌వ‌ర్ ఫుల్ ఉందే..!

రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సినిమా ఆర్‌సీ 15. దిల్ రాజు బ్యాన‌ర్లో 50వ సినిమాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రు. 100 కోట్ల పై చిలుకు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా జ‌రుగుతూనే ఉంది. ఇండియాలో ప‌లు ప్ర‌దేశాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్‌.

కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జ‌రుగుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వ ఆఫీసులు, యంత్రాగం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ఏ టైటిల్ పెడ‌తారా ? అన్న చ‌ర్చ‌లు ముందు నుంచి న‌డుస్తూనే ఉన్నాయి. రెండు, మూడు ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ కూడా ప‌రిశీలించారు.

స‌ర్కారోడు టైటిల్ ముందు అనుకున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టుకు అధికారి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. శంక‌ర్ అన్ని భాష‌ల్లోనూ క‌లిపి అదే టైటిల్ పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ ఒకేసారి ఎనౌన్స్ చేసే ప్లానింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తుండ‌డంతో ఆ టైటిల్ యాప్ట్ అవుతుంద‌నే భావిస్తున్నార‌ట‌.

ఇక రామ్‌చ‌ర‌ణ్ రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ట‌. కియారా అద్వానీతో పాటు సెకండాఫ్‌లో వ‌చ్చే మ‌రో రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్‌కు జోడీగా అంజ‌లిని మ‌రో హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్టుగా తెలుస్తోంది. అలాగే సునీల్‌, శ్రీకాంత్‌తో పాటు ప‌లువురు కీల‌క న‌టీన‌టులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news